Sunday, January 19, 2025

తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ బోర్డు దా దాపు 100 మంది ఎంపి అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై చ ర్చించినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్ర ధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా,రాజ్ నాథ్‌సింగ్‌తో పా టు తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపి లక్ష్మణ్, బం డి సంజయ్‌కుమార్, డికె అరుణ, ఈటెల రాజేందర్, ప్రకాశ్‌రెడ్డి పా ల్గొన్నారు. ఎంపి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయినట్లు చత్తీస్‌గడ్ తరహాలో ముందుస్తు ప్రకటించి మెజార్టీ సీట్లు గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తొలి జాబితాలో సికింద్రాబాద్ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్‌కుమార్,

నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, మహబూబ్‌నగర్ నుండి డికె అరుణ, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌కుమార్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్, మెదక్ నుంచి రఘనందన్‌రావు పేర్లు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మొదటి జాబితా ప్రకటించే చాన్స్ ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిపై దృష్టి సారించి ఈసారి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆపార్టీ సీనియర్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఆపార్టీ ఈసారి కనీసం రెండంకెల సీట్లు సాధించాలని ప్రణాళికలు వేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలను గెలిచి ఓటింగ్ శాతం పెంచుకుంది. అదే తరహాల్లో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాల్లో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందని ఆశావాహులు వెల్లడించారు.

లోక్‌సభలో ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి మధ్య ఎన్నికల పోరు ః బిజెపి నేత డికె అరుణ
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని, మెజార్టీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ పేర్కొన్నారు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ప్రకటించే అవకాశం ఉందని, ఒక్కో నియోజకవర్గం నుంచి 5మందికి పైగా పేర్లు ఉన్నాయని, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవాళ్లకే సీటు దక్కుతుందన్నారు. దేశమంతా మోడీ మేనియా నడుస్తోందని, దక్షిణ భారతదేశం నుంచి మెజార్టీ స్థానాలు గెలవనున్నామని, ఎన్నికల్లో తెలంగాణ తరుపున 10 నుంచి 12 స్థానాలు గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామని చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు మోడీకి ఆకర్షితులు అవుతున్నారని, ఇంకా కొందరు సీనియర్లు తమకు టచ్‌లో ఉన్నారని, వారితో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు ముగిసిన అనంతరం వారిని పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు వెళ్లుతామని తెలిపారు. తెలంగాణలో త్రిముఖ పోటీ లేదని జాతీయ పార్టీల మధ్య మాత్రమే ఉంటుందన్నారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారం చేపట్టిన తరువాత పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆపార్టీ నేతలతు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మరరని, ప్రధాని గ్యారెంటీని బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News