Thursday, January 23, 2025

దక్షిణాదిలో బలోపేతానికి కమలం కసరత్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివిధ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై దక్షిణాది రాష్ట్రాల భేటీలో బిజెపి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రీజినల్ కన్సల్టేటివ్ పేరిట 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలతో జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న ఆయనకు బేగంపేట్‌లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపి బండి సంజయ్, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి దాదాపు 35 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. ఈ సమావేశానికి బిజెపి నాయకులు బిఎల్ సంతోష్, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, డికె అరుణ, ఎంపి లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో సహా తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అండమాన్, లక్ష్యద్వీప్, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ముంబై, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్య నేతలు హాజరయ్యారు. అదే విధంగా రాష్ట్ర బిజెపిలో అసంతృప్త నేతలను బుజ్జగించే పూర్తి బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించారు. జెపి నడ్డా రాక నేపథ్యంలో నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రత ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News