Tuesday, December 24, 2024

ఝార్ఖండ్‌లో “యుసిసి” అమలు చేస్తాం : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్‌షా ఆదివారం రాంచీలో విడుదల చేశారు. మేనిఫెస్టోకు సంకల్ప్ పత్ర అని నామకరణం చేశారు. ఈ సంకల్ప్‌పత్‌ల్రో బీజేపీ అనేక కీలక హామీలిచ్చింది. బీజేపీ ఝార్ఖండ్ రాష్ట్రంలో అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అమలు చేస్తామని(గిరిజనులకు మినహాయింపు), గోగో దీదీ స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ. 2100 నగదు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఝార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం, 21లక్షల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఇంటింటికీ మంచినీటి కనెక్షన్, కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతకు రూ.2 వేల భృతి, యువతకు 2,87వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 5 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు,

లక్ష్మీ జోహార్ యోజన కింద రూ.500 కి గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లు, గిరిజన సంస్కృతి ప్రమోషన్‌కు పరిశోధన కేంద్రం ఏర్పాటు, తదితర హామీలు గుప్పించారు. రాష్ట్రంలో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్‌షా హామీ ఇచ్చారు. చొరబాటుదారులు ఇక్కడికి వచ్చి ఆడపడుచులను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకుని భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారులను ఆపకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి , ఆడబిడ్డలకు భద్రత ఉండదని అన్నారు. సోరెన్ ప్రభుత్వ పాలనలో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువ అవుతున్నందున సంతాల్ పరగణాలో గిరిజనజనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజీపీ అధికారం లోకి వస్తే రాష్ట్రంలో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చట్టం తెస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ప్రవేశ పెడతామని, అయితే గిరిజనులను అందులో నుంచి మినహాయిస్తామని వివరించారు. దేశం లోని అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. పేపర్ లీక్‌లకు పాల్పడుతున్న వారిపై సీబీఐ, సిట్ సోదాలు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రత కల్పించడంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విఫలమయ్యారని మండిపడ్డారు. వారికి తగిన బుద్ధి చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు.

ఉత్సవానికి అంబులెన్స్‌లో వచ్చినందుకు కేంద్రమంత్రిపై కేసు
తిరువనంతపురం : త్రిశ్శూర్ పూరం అనేది కేరళలో ప్రసిద్ధమైన ఉత్సవం. లోక్‌సభ ఎన్నికల సమయంలో త్రిశ్శూర్ నుంచి పోటీకి దిగిన సురేశ్ గోపీ, ఈ ఉత్సవానికి తన వాహనంలో కాకుండా, అంబులెన్స్‌లో వచ్చారు. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సురేశ్ గోపీకి సహాయం చేసేందుకే ఉత్సవానికి అంతరాయం కలిగించినట్టు ఆరోపించాయి. నాటి నుంచి దీనిపై వివాదం నడుస్తోంది. తాజాగా దీనిపై పోలీస్‌లు కేసు నమోదు చేశారు. అయితే కేంద్ర మంత్రి సురేశ్‌గోపీ ఇవన్నీ ఆరోపణలని తోసి పుచ్చారు. “ నా సొంత కారులోనే అక్కడికి వచ్చాను. నేను అంబులెన్స్‌లో రావడం ఎవరైనా చూశారా ? ఒకవేళ చూస్తే అందుకు తగిన ఆధారాలు చూపించాలి. మీరు నిజాన్ని బయటపెట్టాలంటే , ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యం లోని పోలీస్‌ల విచారణ సరిపోదు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకు అప్పగించాలి. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నా” అంటూ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News