Wednesday, November 6, 2024

నేటి నుంచి దేశవ్యాప్తంగా ”భిన్నత్వంలో ఏకత్వం” ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

BJP to organise 'unity in diversity' festivals

మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి(శనివారం) పక్షం రోజుల పాటు బిజెపి దేశవ్యాప్తంగా ”సేవ” పేరిట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇందులో భాగంగా భిన్నత్వంలో ఏకత్వం ఉత్సవాలు, రక్తదాన శిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలను బిజెపి చేపట్టనున్నది. సెప్టెంబర్ 17న మోడీ జన్మదినం నాడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి నాడు ముగుస్తాయని బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం నాడిక్కడ విలేకరులతో వివరించారు. పేదలు, అట్టడుగు వర్గాల చెంతకు వెళ్లి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పక్షం రోజుల ప్రచార కార్యక్రమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాలలో ”భిన్నత్వంలో ఏకత్వం” ఉత్సవాలను నిర్వహించి ప్రజలకు ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్(ఒకే భారత్, ఘనమైన భారత్) సందేశాన్ని అందచేస్తామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా బిజెపి నాయకులు తమకు పరిచయం లేని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని, అక్కడి భాషను, సంస్కృతిని ఒకరోజు పాటు పాటిస్తారని అరుణ్ సింగ్ చెప్పారు. దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేయడం, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలను బిజెపి నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News