Thursday, January 16, 2025

కమలం మెగా పాచిక!

- Advertisement -
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పలు వ్యూహాలు పన్నుతున్నదనే విషయం అర్థం అవుతూ ఉన్నది. తెలంగాణ వాడైన ఆర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన బిజెపి ఆయన నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా ఏ లాభం ఆశిస్తుంది? తెలంగాణ వ్యకికి రాజ్యసభ ఇచ్చినందుకు జగన్ మోహన్ రెడ్డి ఎపిలో తీవ్ర విమర్శను ఎదుర్కోవడం తప్ప రాజకీయంగా లాభపడిందేమీ లేదు. బిజెపికి మాత్రం అక్కడ ఏం ఒరగ పెట్టగలడు. ఆయన వెనుకబడిన తరగతులకు సంబంధించినవాడే కాకుండా బిసిల సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. స్వయంకృతం వల్ల బలహీనపడి అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) స్థానాన్ని తెలంగాణలో తాను ఆక్రమించుకోవాలనుకుంటున్న బిజెపికి అదే తెలంగాణకు సంబంధించిన కృష్ణయ్యను రాజ్యసభకు పంపి లాభం పొందాలని చూస్తున్నది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బయటికి మాత్రం చీటికిమాటికి చంద్రబాబు నాయుడు భజన చేస్తున్న అక్కడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారానే భవిష్యత్తులో బలపడాలనే ప్రయత్నాలు బిజెపి చేస్తున్నదని అర్థమవుతూనే ఉన్నది. మొదటి నుండి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ సహజ మిత్రుడు. అవసరాల కోసం మధ్యలో చంద్రబాబు నాయుడుతో కలిశాడు కానీ, ఆయన భారతీయ జనతా పార్టీకి మిత్రుడే కాకుండా బద్ధ శత్రువులైన చంద్రబాబు నాయుడును భారతీయ జనతా పార్టీని కలపడానికి ఆయన భారతీయ జనతా పార్టీ తరపుననే పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మీద కొంత ఆధారపడాలని నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతుంది మనకు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని చేసిన విన్యాసాలు ఆ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల క్రితం ఏర్పడిన ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం రోజున వేదిక మీద జరిగిన తతంగం గనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను రచిస్తున్నారో. అప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు అయోమయంగా చూస్తూ ఉంటే ప్రధానమంత్రి ఆయనను దాటేసి నడుచుకుంటూ వెళ్లి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యలో నిలబడి వారితో చేతులు కలిపి పైకి లేపి వేదిక మీద నుండి ప్రజలకు అభివాదం చేయడం ఎటువంటి సంకేతాలను పంపించింది అనుకోవాలి?. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు రాజకీయ చిత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. నమ్మదగని తాత్కాలిక మిత్రుడు చంద్రబాబును ఎప్పటికైనా వదిలించుకుని కొణిదెల సోదర త్రయం, వారి సామాజిక వర్గం బలాన్ని ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉన్నట్టుండి సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. అందులోనూ ఒక సినిమా కు టుంబం ఈ మధ్య బాగా వార్తలకి ఎక్కుతున్నది. చాలా సార్లు చెప్పుకున్నట్టుగానే తమిళనాడు లాగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు సినిమాల మధ్య ఉండే సన్నటి గీత పూర్తిగా చెరిగిపోతున్నట్టు కనిపిస్తున్నది.
రాజకీయ నిర్ణయాలను చివరి నిమిషం దాకా అతి గోప్యంగా ఉంచడంలో మహా దిట్ట అని ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు పేరు ఉండేది. అందుకు ఒక ఉదాహరణగా వాజ్‌పేయీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా గంటి మోహన చంద్ర బాలయోగిని నియమించే సమయంలో చంద్రబాబు పాటించిన గోప్యత గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు అందరూ.

ఎక్కడో అమలాపురంలో ఉన్న బాలయోగికి చివరి నిమిషం దాకా తెలియదు తాను లోక్‌సభ స్పీకర్ కాబోతున్నానని. హైదరాబాద్‌కు పిలిపించి బేగంపేట విమానాశ్రయంలో విమానం ఎక్కించే వరకు కూడా ఆయనకు విష యం తెలియదు. అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది స్పీకర్ పదవికి నామినేషన్ వేయాల్సిన చివరి రోజు అది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి లోక్‌సభ దాకా ట్రాఫిక్‌ను ఆపేసి ఆయన వాహనాన్ని పరుగులు పెట్టించి చివరి నిమిషంలో బాలయోగి చేత నామినేషన్ వేయించారు.ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే నేను మళ్ళీ 90ల నాటి మనిషిని అవుతున్నాను అని చెప్పుకుంటున్న చం ద్రబాబు నాయుడు ప్రముఖ నటులు చిరంజీవి పవన్ కళ్యాణ్‌ల సోదరుడైన కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీ సుకుంటున్నానని ముందే పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు. విషయాలను అత్యంత గోప్యంగా ఉంచే ఆ చంద్రబాబుకి ఈ చంద్రబాబుకి ఎటువంటి పోలిక లేదు.

సాధారణంగా మంత్రివర్గంలోకి ఎవరిని చేర్చుకున్నా గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయించే ఒక గంట ముందు మాత్రమే ఆ అభ్యర్థికి తెలియజేస్తారు. మహా అయితే ఒకపూట ముందు చెప్తారేమో. అంతేకానీ విస్తరణ ఎప్పుడో ఇంకా ముహూర్తం కూడా ఖరారు గాని మంత్రివర్గంలోకి ఫ లానా వ్యక్తిని తీసుకోబోతున్నానని లెటర్ హెడ్ మీద ప్రకటన విడుదల చేయడం ఎక్కడా జరగదు. ఇది కచ్చితంగా ఒత్తిడి కారణంగానే చంద్రబాబు చేశారని చెప్పుకుంటున్నారు బయ ట. సహజంగానే ఈ ఒత్తిడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చి వుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబును రాజ్యసభకు పంపాలని అడిగారు. అది సాధ్యం కాదన్నందుకు మంత్రివర్గంలో చేర్చుకోండి, అది కూడా ముందే ఒక అధికారి ప్రకటన చేయండి అని చెప్పి పవ న్ కళ్యాణ్ పట్టుబట్టినట్టున్నారు. అంటే మెగా కుటుంబంలోని రెండో వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతున్నారు.
ఈలోగా రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే నలుగురు అభ్యర్థుల పదవులు ఖాళీగా ఉన్నాయని అందులో ఒకటి మెగా బ్రదర్స్ పెద్దన్న, ప్రముఖ నటుడు చిరంజీవికి దక్కబోతున్నదని వార్తలు వెలువడ్డాయి. అది భారతీయ జనతా పార్టీ కోటాలో జరగబోతున్నది. మొత్తానికి కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు రాజకీయాల్లో ఏదో పదవుల్లో ఉండబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభకు మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. అలా అనడం కంటే ఖాళీ చేయించారు అం టే కరెక్ట్‌గా ఉంటుంది. అట్లా ఖాళీ అయిన స్థానాల్లోకి భారతీయ జనతా పార్టీ నుంచి మళ్లీ ఆర్. కృష్ణయ్యకే రాజ్యసభ టి కెట్ ఇచ్చారు. ఆయన మధ్యలోనే రాజీనామా చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ స్థానానికి. ఆయ న తెలంగాణ నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున శా సన సభ్యుడిగా ఎన్నికయిన వ్యక్తి. ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ ఆయనకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల కోటాలో రాజ్యసభ పదవి ఇచ్చింది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి మరోసారి రాజ్యసభ సభ్యత్వం తెచ్చుకున్నాడు ఆయన. కృష్ణయ్య తో బాటు రాజీనామా చేసిన ఇద్దరూ బీద మస్తాన్ రావు, మో పిదేవి వెంకటరమణ. ఇందులో బీద మస్తాన్ రావుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ టికెట్ ఇచ్చింది. ఎటూ కాకుం డా పోయిన వాడు మోపిదేవి వెంకటరమణ. మత్స్యకార కు టుంబాల నుంచి వచ్చిన మోపిదేవికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. శాసనసభకు పోటీ చేసి ఓడిపోతే మండలి సభ్యత్వం ఇచ్చింది. అక్కడి నుండి మళ్ళీ రాజ్యసభ కు కూడా పంపించి గౌరవించింది. అయినా కష్టాల్లో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి అధికార పక్షానికి ఎందు కు వలసపోయాడో కారణాలు ఆయనకే తెలియాలి.. పోయి నా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన ఇద్దరూ లాభపడ్డారు. కానీ ఆయన ఎటూ కాకుండా పోయాడు.

ఒక పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు రాజ్యసభ స భ్యులను అనైతికంగా రాజీనామా చేయించిన అధికార కూటమిలోనే ఉన్న బిజెపి ఎంఎల్‌ఎ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యా ఖ్యలు ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ‘వాళ్లని నమ్మి జగన్ రాజ్యసభ పదవులు ఇస్తే పార్టీని వీడడం అనైతికం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే పార్టీ మారడం అనైతికం’ అన్నారు విష్ణుకుమార్ రాజు. అది కూడా మళ్లీ అదే పదవి కోసం పాకులాడటం పట్ల అభ్యంతరం తెలిపారాయన. సాంకేతికంగా వారి రాజీనామాలు సరైనవే అయినా నైతికంగా ఇది మంచి పద్ధతి కాదు అన్నారాయన. అధికారంలో ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్య చేసినందుకు విష్ణుకుమార్ రాజును అభినందిద్దాం.
ఇక చంద్రబాబు నాయుడు ఎటువంటి రాజకీయ ఒత్తిడిలో ఉన్నారో చెప్పుకోవడానికి రెండు అంశాలు మాట్లాడుకోవాలి. ఒక ఒత్తిడి పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చింది, ఆయన తన అన్నను మంత్రి వర్గంలోకి తెచ్చుకుంటున్నాడు రాజ్యసభ ఇవ్వనందుకు. రెండవది కుమారుడు మంత్రి అయి న లోకేష్ నుంచి వచ్చింది. లోకేష్‌కు సన్నిహితుడైన సాన సతీష్‌కు రాజ్యసభ ఇవ్వాల్సిందేనన్న ఒత్తిడి బాగా పెరిగిన కారణంగానే నాగబాబుకి ఇవ్వలేకపోయారు అన్న విషయం స్పష్టం. ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఇంకా అనేక ఒత్తిళ్లు ఎదుర్కోబోతున్నారు రాజకీయంగా అనేది ఈ ఆరు మాసాల్లోనే అర్థమైంది.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పలు వ్యూహాలు పన్నుతున్నదనే విషయం అర్థం అవుతూ ఉన్నది. తెలంగాణ వాడైన ఆర్. కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుం చి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన బిజెపి ఆయన నుంచి ఆం ధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా ఏ లాభం ఆశిస్తుంది? తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినందుకు జగన్ మోహన్ రెడ్డి ఎపిలో తీవ్ర విమర్శను ఎదుర్కోవడం తప్ప రాజకీయంగా లాభపడిందేమీ లేదు. బిజెపికి మాత్రం అక్కడ ఏం ఒరగ పెట్టగలడు. ఆ యన వెనుకబడిన తరగతులకు సంబంధించినవాడే కాకుం డా బిసిల సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. స్వయంకృతం వల్ల బలహీనపడి అధికారం కోల్పోయిన భార త రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) స్థానాన్ని తెలంగాణలో తాను ఆ క్రమించుకోవాలనుకుంటున్న బిజెపికి అదే తెలంగాణకు సం బంధించిన కృష్ణయ్యను రాజ్యసభకు పంపి లాభం పొందాలని చూస్తున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బయటికి మాత్రం చీటికిమాటికి చంద్రబాబు నాయుడు భజన చేస్తున్న అక్కడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారానే భవిష్యత్తులో బలపడాలనే ప్రయత్నాలు బిజెపి చేస్తున్నదని అర్థమవుతూనే ఉన్నది.

మొదటి నుండి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ సహజ మిత్రుడు. అవసరాల కోసం మధ్యలో చంద్రబా బు నాయుడుతో కలిశాడు కానీ, ఆయన జనతా పార్టీకి మిత్రుడే కాకుండా బద్ధ శత్రువులైన చంద్రబాబు నాయుడును భారతీయ జనతా పార్టీని కలపడానికి ఆయన భారతీయ జనతా పార్టీ తరపుననే పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మీద కొంత ఆధారపడాలని నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతుంది మనకు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని చేసిన విన్యాసాలు ఆ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల క్రితం ఏర్పడిన ఎన్‌డి ఎ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం రోజున వేదిక మీద జరిగిన తతంగం గనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు సం బంధించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను రచిస్తున్నారో అప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు అయోమయంగా చూస్తూ ఉంటే ప్రధానమంత్రి ఆయనను దాటేసి నడుచుకుంటూ వెళ్లి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యలో నిలబడి వారితో చేతులు కలిపి పైకి లేపి వేదిక మీద నుండి ప్రజలకు అభివాదం చేయడం ఎటువంటి

సంకేతాలను పంపించింది అనుకోవాలి?
ఇది ఇట్లా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవి మా కాంగ్రెస్ నాయకుడు అంటారు. (శుక్రవారం నాడు ఢిల్లీలో ఒక జాతీయ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి వివరణ ఇస్తూ అల్లు అర్జున్, ఆయన కుటుంబంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గురించి చెపుతూ అర్జున్ మేన మామ చిరంజీవి మా కాంగ్రెస్ నాయకుడే అన్నారు).
చిరంజీవి ఎప్పటి కాంగ్రెస్ నాయకుడు, ఎక్కడి కాంగ్రెస్ నాయకుడు? రాష్ట్రం విడిపోయిన ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడా కాంగ్రెస్ వేదికల మీద కనిపించని చిరంజీవి ఒకటి రెండు పర్యాయాలైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడం రేవంత్ రెడ్డి గమనించినట్లు లేరు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు రాజకీయ చిత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. నమ్మదగని తాత్కాలిక మిత్రుడు చంద్రబాబును ఎప్పటికైనా వదిలించుకుని కొణిదెల సోదర త్రయం, వారి సామాజిక వర్గం బలాన్ని ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తున్నది.

దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News