Friday, November 22, 2024

దశాబ్దాలపాటు బిజెపి రాజకీయాల్లో ఉంటుంది: ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

Prashant Kishore

గోవా: ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ప్రశాంత్ కిశోర్ గురువారం గోవాలో ప్రసంగిస్తూ “ బిజెపి ఎక్కడికీ పోదు. దశాబ్దాలపాటు కొనసాగుతుంది. ఈ సత్యాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారు” అన్నారు. “గెలిచినా, ఓడినా బిజెపి భారతీయ రాజకీయంలో కేంద్ర స్థానంలో ఉండగలదు. ఎలాగైతే తొలి 40 ఏళ్లు కాంగ్రెస్ ఉండిందో అలాగే ఉండనుంది. బిజెపి ఎక్కడికీ పోదు. జాతీయ స్థాయిలో 30 శాతానికి పైగా ఓట్లు గెలుచుకున్న బిజెపి అంత త్వరగా ఏమి పోదు. ప్రధాని నరేంద్ర మోడీని త్వరలో ఏరీ పారేస్తారన్న భ్రమలో ఉండొద్దు. ఒకవేళ ప్రధాని మోడీని తొలగించేసినా బిజెపిని తొలగించలేరు. బిజెపి ఎక్కడికీ పోదు. కొన్ని దశాబ్దాలపాటు కొనసాగుతుంది” అని కిశోర్ తెలిపారు. ఆయన ఇంకా “ కొన్ని నెలల తర్వాత ప్రజలు నరేంద్ర మోడీని తొలగించేస్తారని రాహుల్ గాంధీ భావిస్తున్నారు కామోసు. కానీ అలా జరగదు” అన్నారు. బిజెపికి చెందిన అజయ్ సెహ్రావత్ దీనికి సంబంధించిన క్లిప్‌ను ట్వీట్ చేశారు. “ భారతీయ రాజకీయాల్లో బిజెపి కొనసాగుతుందని ప్రశాంత్ కిశోర్ ఆమోదించారు. అందుకనే ఈ విషయాన్ని అమిత్ షా కూడా ముందుగానే ప్రకటించారు” అని రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News