Wednesday, March 26, 2025

ఆదాయంలో పెద్దన్న బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన రాజకీయ పా ర్టీలో అధికార బిజెపి అగ్రభాగాన నిలిచింది. ఆ పార్టీకి రూ.4,340 కోట్లు సమకూరినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) పరిశోధనలో వెల్లడైంది. ఆరు జాతీయ పార్టీల గత ఆర్థిక సంవత్సరం ఆదాయంతో పోల్చితే 74.57 శాతంతో బిజెసి సింహభాగాన నిలిచిన ట్లు తేలింది. అయితే 4,340 కోట్ల ఆదాయం లో బిజెపి 50.96 శాతం(రూ.2211 కోట్లు) ఖర్చు పెట్టినట్లు ఏడిఆర్ పేర్కొంది. ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ రూ.1,225 కోట్ల ఆదాయంతో తర్వాతి స్థానంలో నిలిచిం ది. మొత్తం ఆదాయంలో కాంగ్రెస్ రూ.1,025 కోట్లు(83.69) ఖర్చు చేసిందని వివరించింది. జాతీయ పార్టీలకు అత్యధిక ఆదాయం విరాళాలు, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన ట్లు ఎడిఆర్ తెలిపింది.

ఆ రకంగా బిజెపి అత్యధికంగా రూ.1685కోట్లు, కాంగ్రెస్ రూ.828 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ రూ.10.15 కోట్లు ఆ ర్జించినట్లు వెల్లడించింది. ఈ మూడు పార్టీల మొత్తం ఆదాయంలో ఎలక్టోరల్ బాండ్లు, విరాళాల రూపంలో 43.36శాతంగా ఉంది. ఎస్‌బి ఐ లెక్కల ప్రకారం 202324 ఆర్థిక సంవత్స రం ప్రకారం రూ.4,507 కోట్ల రూపాయాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆయా పార్టీలకు అందినట్లు తెలిపింది. ఎన్నికల కోసం కాంగ్రెస్ అత్యధికంగా రూ.619 కోట్లు ఖర్చు చేయగా.. అడ్మినిస్ట్రేషన్ కోసం మరో రూ.340 కోట్లు ఖ ర్చు పెట్టినట్లు తేలింది. సిపిఎం రూ.56.29 కో ట్లు అడ్మినిస్ట్రేషన్ కోసం, రూ.47.57 కోట్లు సా ధారణ ఖర్చులు చేసినట్లు తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News