Friday, December 20, 2024

భారత్ జోడో యాత్ర ఆపడానికి బీజేపీ కుంటిసాకులు : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను భారత్ జోడోయాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి యాత్రను ఆపడానికి బీజేపీ కుట్రలు చేస్తూనే ఉందని ఆయన ఆరోపించారు. తన యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి బీజేపీ నేతలు ఓర్వలేక పోతున్నారని మండి పడ్డారు.

ఇప్పటికే ఎన్నో విధాలుగా యాత్రను ఆపడానికి ప్రయత్నించి విఫలమైన బీజేపీ నేతలు , ఇప్పుడు కరోనా మహమ్మారి పేరుతో తన యాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ బయటపడినందున యాత్రలో కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, లేదంటే యాత్రను నిలిపేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖపై మాట్లాడుతూ రాహుల్ బీజేపీపై విమర్శలు చేశారు. ఎలాగైనా తన యాత్రను ఆపడానికి బీజేపీ కుంటిసాకులు వెతుకుతున్నదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News