Sunday, December 22, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ముగ్గురిని ప్రశ్నిస్తున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

BJP trying to buy TRS MLAs

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు వ్యవహరంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు నిందితులను రహస్య ప్రాంతాల్లో ఉంచి, ఎంఎల్ఏల బేరసారాల వెనుక ఎవరున్నారనే అంశంపై విచారిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లలో ఎవరితో మాట్లాడారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాలు సేకరించి కోర్టులో హాజరుపరచనున్నారు. పోలసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అటు మొయినాబాద్ లోని ఫౌమ్ హౌస్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ లోకి ఇతరులను అనుమతించడం లేదని చెప్పారు. ఫామ్ హౌస్ లో ఎక్కడైనా డబ్బులు దాచారా? అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News