Monday, December 23, 2024

వ్యాపారులను జడిపించిన గబ్బర్ టాక్స్

- Advertisement -
- Advertisement -

BJP turned ‘Genuine Simple Tax’ into ‘Gabbar Singh Tax’: Rahul Gandhi

జిఎస్‌టి ఐదేళ్లపై రాహుల్

న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ రూపొందించిన జెన్యున్ సింపుల్ టాక్స్ (జిఎస్‌టి)ను దారుణరీతిలో గబ్బర్‌సింగ్ టాక్స్ (జిఎస్‌టి)గా మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సముచిత పన్నుల విధానం బాదుడు భయపెట్టుడు విధానంగా మారిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం జులై 1తో దేశంలో జిఎస్‌టి ప్రవేశపెట్టి ఐదేళ్లు పూర్తి అవుతున్న దశలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వెలువడ్డాయి. జిఎస్‌టి స్వరూపాన్నే కేంద్రం మార్చిపడేసిందని రాహుల్ ఆర్థిక మంత్రిపై విసుర్లకు దిగారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే జిఎస్‌టి 2.0ను తీసుకువస్తుంది. ఇందులో తక్కువ స్థాయి పన్నుల విధానం ఉంటుంది. జిఎస్‌టి ద్వారా వచ్చే వసూళ్లను రాష్ట్రాల మధ్య సముచితంగా పంపిణీ చేస్తారని వివరించారు. జిఎస్‌టి వచ్చిన 1826 రోజులలో ఆరు రేట్లు, వేయికి పైగా మార్పులు జరిగాయి. వెరశి అంతా కుప్ప అయింది. ప్రత్యేకించి చిన్న తరహా వ్యాపారులకు ఇతరులకు తమ దైనందిన కార్యకలాపాలలో పిడుగుపాటు అయిందని, అందుకే జిఎస్‌టి గబ్బర్ సింగ్ టాక్స్‌గా మారిందని మండిపడ్డారు. వ్యాపారవేత్తల పాలిట కరకుగా ఉన్న టాక్స్‌ను గబ్బర్‌సింగ్ పన్ను అనకుండా ఏమి అంటారని రాహుల్ ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News