Sunday, February 9, 2025

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు..! : తెలంగాణ బిజెపి ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు ఇచ్చారని తెలంగాణ బిజెపి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తెలంగాణ బిజెపి తన అధికారికి ఎక్స్ ఖాతా వేదికగా ఈ సెటైరికల్ ట్వీట్ చేసింది. గత రాష్ట్ర ఎన్నికల సమయంలో రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును నెత్తిన పెట్టుకోని ప్రచారంలో పాల్గొన్న ఫోటోను విస్త్రత ప్రచారం చేశారు.

ఇప్పుడు అదే ఫోటోను బీజేపీ ఉపయోగించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ టి బిజెపి ట్వీట్ వేసింది. చేయి సింబల్ సైతం గుండు సున్నా చూపిస్తున్న విధంగా వీడియోలో కన్పిస్తోంది. ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2025 సందర్భంగా బాలక్బుద్ధి, గుంపుమేస్త్రి కోసం ప్రత్యేక పాట అంటూ ఆ వీడియోను బిజెపి షేర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News