Monday, December 23, 2024

వరంగల్‌లో బిజెపి నిరుద్యోగ మార్చ్

- Advertisement -
- Advertisement -

వరంగల్ లో బిజెపి నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగ మార్చ్ కు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిరుద్యోగులు, పలువురు బిజెపి నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ నిరుద్యోగ మార్చ్  కొనసాగుతోంది. వరంగల్ లోని కాకతీయ వర్శిటీ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు మార్చ్ ప్లాన్ చేశారు. అయితే కేయూ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు పోలీసులు భారీగా మోహరించారు. నిరుద్యోగ మార్చ్ ప్రాంతానికి బయట వాహనాలను రాకుండా ట్రాఫిక్ మళ్లించారు వరంగల్ పోలీసులు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News