Monday, December 23, 2024

త్రిపుర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం

- Advertisement -
- Advertisement -

అగర్తలా : త్రిపుర మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 97 శాతం సీట్లను దక్కించుకోగలిగింది. గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్‌లలో పోటీ లేని స్థానాల్లో 71 శాతం ్ల బీజేపీ గెలుపొందగా, మిగతా 29 శాతం స్థానాలకు ఆగస్టు 8న మంగళవారం పోలింగ్ జరిగింది. గత జూన్‌లో రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీయే గెలిచింది. 8 జిల్లా పరిషత్‌ల్లో మొత్తం 96 స్థానాలకు బీజేపీ 93 స్థానాలను గెలుచుకుంది.

కాంగ్రెస్ 2, సిపిఎం 1 గెలుచుకున్నాయి. పంచాయతీ సమితుల్లో మొత్తం 188 స్థానాలకు బీజేపీ 173 కైవసం చేసుకుంది. సిపిఎం 6, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 1819 గ్రామ పంచాయతీల్లో 1476 బీజేపీ దక్కించుకోగా, సిపిఎం 148, కాంగ్రెస్ 151, త్రిపుర మోతా 24 స్థానాలను పొందాయి. అధికార పార్టీలో ఉగ్రవాద ఎత్తుగడల ఫలితంగా 71 శాతం సీట్లలో అభ్యర్థులను నిలబెట్ట లేక పోయామని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ఈ తీర్పు ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి మానిక్ సహా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News