హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోమవారం తెలంగాణ తల్లి విగ్రాహావిష్కరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన సభ్యులు సభలో ఇలా నడుచుకోవడం సరికాదని మండిపడ్డారు.
ఇవాళ సభ ముఖ్యమంత్రి ప్రకటన మీద జరుగుతుందని.. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్టయితే.. వివరాలు ఇవ్వండి అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. సభ తర్వాత బిజెపి సభ్యులు, మంత్రిని పిలిచి మాట్లాడుతానని స్పీకర్ చెప్పారు. అయినా వినకపోవడంతో సభను అమర్యాదపరిచేలా మాట్లాడవద్దని స్పీకర్ వారించారు. సీఎం ప్రకటనపైనే ఇవాళ్టి సభ నడుస్తుందని.. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై అధికార పక్షం సూచనలు ఇచ్చిందని తెలిపారు. న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని స్పీకర్ తెలిపారు.