Friday, November 22, 2024

యూనిఫాం సివిల్ కోడ్ ప్యానెల్ వెనుక గుజరాత్ ప్రభుత్వ ఉద్దేశాన్నిప్రశ్నించిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం గుజరాత్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ను అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే… దాని వెనుక ఉద్దేశాన్ని ప్రశ్నించారు, ఒకవేళ బిజెపి అలా చేయాలనుకుంటే, అది దేశం అంతటా చేయాలని అన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడానికి కారణం లోక్‌సభ ఎన్నికల దృష్ట్యానా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అక్కడ ప్రచారం చేస్తున్న ఆయన దీని వెనుక బిజెపి దురుద్దేశాలున్నాయన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా గుజరాత్ లో ఇంకా ఎన్నికల తేదీని ప్రకటించలేదన్నారు. గుజరాత్ లో తన మూడో రోజు ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఆయన భవానీనగర్ లో విలేకరుల సమావేశంలో ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వం రాజ్యాంగంలోని 44 ఆర్టికల్ కింద ఉమ్మడి పౌర స్మృతిని ఏర్పాటు చేయవచ్చని… కానీ,దానికి ముందు అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవలసి ఉంటుంది’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News