Monday, December 23, 2024

అడవులకే ఆదివాసీలు పరిమితం

- Advertisement -
- Advertisement -

మజూలి : గిరిజనులను అడవులకు పరిమితం చేయాలని, వారికి విదయ, తదితర అవకాశాలు లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండవ రోజు తన తొలి బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ, తమ వనరుల మొదటి వినియోగదారులుగా ‘ఆదివాసీల’ హక్కులను కాంగ్రెస్ గుర్తిస్తున్నదని తెలియజేశారు. ‘మేము మిమ్మల్ని ఆదివాసీగా పిలుస్తున్నాం.

ఆదివాసీ అంటే తొలి నివాసులు అని అర్థం. బిజెపి మిమ్మల్ని వస్‌వాసీ అని పిలుస్తుంది. అంటే అడవులలో నివసించేవారు అని అర్థం’ అని రాహుల్ చెప్పారు. అస్సాంలో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బిజెపి గిరిజనులను అడవులకు పరిమితం చేసి, వారి పిల్లలకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి, ఇంగ్లీష్ నేర్చుకునే, వ్యాపారాలు నిర్వహించే అవకాశాలను లుప్తం చేయాలని కోరుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ‘మీ సొంతం మీకు తిరిగి రావాలని మేము వాంఛిస్తున్నాం.

మీ నీరు. భూమి, అడవి మీదే కావాలి’ అని రాహుల్ అన్నారు. ద్వీప జిల్లా మజూలిలో ప్రధానంగా నివసించే గిరిజన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. బిజెని ప్రభుత్వం దేశవ్యాప్తంగా గిరిజనుల భూమిని ‘స్వాధీనం చేసుకుంటోంది’ అని రాహుల్ ఆరోపించారు. ‘మీకు ఏమి జరుగుతోందో మీ అందరికీ తెలుసు. మీ భూమి లాక్కుంటున్నారు. మీ చరిత్రను తుడిచిపెట్టేస్తున్నారు.

ఇది దేశవ్యాప్తంగా వాస్తవం’ అని ఆయన ఆరోపించారు. 2022=23లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ మొదటి ‘భారత్ జోడో యాత్ర’విజయవంతం అయిందని, దానితో తూర్పు నుంచి పశ్చిమం వరకు అటువంటి యాత్ర నిర్వహించాలని జనం కోరారని ఆయ తెలిపారు. ‘అందుకే మేము మణిపూర్ నుంచి ముంబయికి ఈ యాత్ర ప్రారంభించాం’ అని రాహుల్ చెప్పారు. ఇది బిజెపితో సైద్ధాంతిక పోరాటం అని ఆయన పేర్కొన్నారు. తన కారులో నుంచి కొద్ది సేపు ప్రసంగించిన అనంతరం రాహుల్ గాంధీ సాంప్రదాయక ‘ధోవతి’ ధరించి వైష్ణవ ప్రదేశం శ్రీ శ్రీ ఔనియతి సత్రాన్ని సందర్శించి సత్రం అధిపతితో చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News