Sunday, January 19, 2025

అరెస్టు చేస్తారనే భయం లేదు : సిబిఐ విచారణపై సిసోడియా

- Advertisement -
- Advertisement -

BJP wants to send me to jail in fake case:Manish sisodia

నకిలీ కేసులో జైలుకు నన్ను పంపాలని బీజేపీ కోరిక

న్యూఢిల్లీ : ఎక్సయిజ్ పాలసీకి సంబంధించి తనపై సిబిఐ నకిలీ కేసు నమోదు చేయడమే కాకుండా , గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ప్రఖ్యాతిని చూసి బీజేపీ భయపడుతోందని, అందులో భాగంగానే సిబిఐ తనను ప్రశ్నిస్తోందని ఢిల్లీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సోమవారం వ్యాఖ్యానించారు. సిబిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లే ముందు సిసోడియా మదుర రోడ్ లోని తన నివాసంలో తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన నివాసం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఊరేగింపులా రావడంతో సిసోడియా సిబిఐ కార్యాలయానికి బయలుదేరారు. ఆప్ కార్యకర్తలతో మాట్లాడుతూ సిబిఐ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, అరెస్టుకు ఏమాత్రం భయపడబోనని స్పష్టం చేశారు. ఆప్ కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. మహాత్శుడు కూడా నకిలీ కేసుల బెడద ఎదుర్కొన్నారని, అందువల్ల మహాత్మునికి నివాళి అర్పించానని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News