Monday, December 23, 2024

ఢిల్లీలో ఉచిత విద్యుత్తు సరఫరాను బిజెపి ఆపాలనుకుంటోంది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: “ఢిల్లీలో బిజెపి ఉచిత విద్యుత్తు సరఫరాను ఆపాలనుకుంటోంది. కానీ అది ఈ విషయంలో విజయం సాధించలేదు” అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫును పౌర సంస్థల ఎన్నికలకు పహార్‌గంజ్‌లో ప్రచారం చేస్తూ ఈ విషయం చెప్పారు. ఢిల్లీలో వారు అభివృద్ధి కార్యక్రమాలను ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి)లో బిజెపియే అధికారంలో ఉంది.
“ఉచిత విద్యుత్తు సరఫరాను వారు ‘ఫ్రీబీ’ అంటున్నారు. వారు మనమేదో బిచ్చగాళ్లమైనట్లు, మనకేదో చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఉచిత విద్యుత్తు సరఫరాను వారెందుకు ‘ఫ్రీబీ’ అంటున్నారు? ఎందుకంటే వారు ఢిల్లీలో ఉచిత విద్యుత్తు సరఫరాను ఆపాలనుకుంటున్నారు కనుక. కానీ నేను బతికున్నంత కాలం ఢిల్లీలో ఉచిత విద్యుత్తు సరఫరా కొనసాగుతుంది” అని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ 2019లోనే ఢిల్లీలో ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆమ్‌ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్తు హామీపైనే ఓట్లడుగుతోంది. చెత్త ఎత్తివేత నిర్వహణ బాధ్యత బిజెపిదని, ఎంసిడిలో ఆప్ పార్టీ కనుక వస్తే దానిని పరిష్కరిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. “ఆప్‌కు ఓ సారి అవకాశం ఇవ్వండి. మేము విద్యుత్తు, నీరు ఉచితంగా అందించినట్లే, చెత్త విషయాన్ని కూడా పరిష్కరిస్తాం. చెత్త ఎత్తివేతలో బిజెపి మిస్‌మేనేజ్‌మెంట్ చేస్తోందని ఆయన విమర్శించారు. ఎంసిడిలో ఉన్న 250 సీట్లలో ఆప్‌కు 230 సీట్లు రావాలి. అలాగైతేనే రాష్ట్ర స్థాయిలోనూ, స్థానిక సంస్థల స్థాయిలోనూ ఆప్ అధికారంలో ఉండగలదని ఆయన అన్నారు. “ఒకవేళ బిజెపి గెలిస్తే, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. వారు ప్రతి రోజూ మాతో పోట్లాడుతూనే ఉండగలరు. ఇప్పుడు కూడా వారు చేస్తున్నదదే. రెండు చోట్ల ఆప్ అధికారంలోకి రావాలి. అన్ని పనులు జరిగేలా కేజ్రీవాల్ ఒక్కడే చూడగలడు”అని ఆయన చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News