Monday, December 23, 2024

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం: అధికార ప్రతినిధి సంగప్ప

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో తమ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప సంగప్ప అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 600 కార్ల కాన్వాయ్ తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం పై ఆయన విమర్శలు గుప్పించారు. కెసిఆర్ 600 కార్ల కాన్వాయ్ తో హైదరాబాద్ నగరం నుంచి మహారాష్ట్ర బార్డర్ దాకా వెళ్ళడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా పై ఒక మంత్రి.. ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలని ఆయన ఖండించారు. ఈ సమావేశంలో బిజెపి అధికార ప్రతినిధులు విఠల్, కట్టా సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News