Monday, December 23, 2024

తెలంగాణలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్‌ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం మహా జనసంపర్క్ అభియాన్‌”లో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్‌ఎస్ లోకేనని అన్నారు.

బీజేపీ-జనసేన పొత్తుపై… తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేస్తుంది. అదికారం కైవసం చేసుకుంటుందన్నారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని అన్నారు. పొన్నం వ్యాఖ్యలపై….. విమర్శలు హుందాగా ఉండాలే… నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సాయంతో ఎంపీగా గెలిచానంటే జనం నవ్వుకుంటున్నారు.

అదే నిజమైతే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా ఎట్లా గెలిచారు? అని అన్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తాము నివాసం ఉండే పోలింగ్ బూత్ లకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. మోదీగారి 9 ఏళ్ల పాలనను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం అన్నారు.

“ఇంటింటికీ బీజేపీ” కార్యక్రమం ద్వారా ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. తెలంగాణలో 90 లక్షలకుపైగా కుటుంబాలుంటే అందులో మూడో వంతుకుపైగా కుటుంబాలను బీజేపీ కార్యకర్తల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు కలిసేలా కార్యాచరణ రూపొందించాం అన్నారు.

ఉదయం 9 గంటల వరకే నాకు అందిన సమాచారం ప్రకారం…. బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా దాదాపు 10 లక్షల కుటుంబాలను కలుసుకున్నారు అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35 లక్షల కుటుంబాలను కలిసి మోదీ పాలనపై కరపత్రాలు పంపిణీ చేసామన్నారు. మేం చాలా పాజిటివ్ మూడ్ లో చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ జనంలోకి వెళుతున్నాం.. ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు.

దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లారీ, ఆటో, ట్రాలీ, బస్ డ్రైవర్లందరినీ ఒకరోజు కలుస్తాం. వీరితోపాటు టీ స్టాల్స్, పాన్ దుకణాలు, హోటళ్లు, వ్యాపార నిర్వాహకులను కలవాలని నిర్ణయించామన్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంకు మంచి స్పందన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News