Saturday, December 21, 2024

వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
  • ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే పిఎన్ పాఠక్

ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషినగర్ శాసన సభ్యులు పిఎన్ పాఠక్ అన్నారు. బిజెపి చేపట్టిన ఎమ్మెల్యే ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం ధర్మపురి చేరుకుని పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

అనంతరం స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యుపి ఎమ్మెల్యే పాఠక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో రెండు సార్లు అధికారాన్ని చేపట్టిందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితుడిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని హామిలు ఇచ్చి మొదటి సారి అధికారంలోకి వచ్చి, బడుగు బలహీన వర్గాల ప్రజలను దళితులను మోసం చేసిందన్నారు.

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ బృతి, ఒక లక్షా రూపాయల రుణ మాఫి, రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి బిఆర్‌ఎస్ రెండవ సారి అధికారంలోకి వచ్చిందన్నారు. బిఆర్‌ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామి అమలు చేయడం లేదన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఉత్తర ప్రదేష్ రాష్ట్రంలో ఇప్పటికే 17 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద ప్రజల సొంతింటి కళ నేరవేరేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తుంటే కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడి పోటో ఎక్కడ పెట్టడం లేదని విమర్శించారు. ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాట ఉంటుందని, కాని పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే పొందుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతితో కూడిన కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు.

నరేంద్ర మోడి నాయకత్వంలో దేశంలో మూడవ సారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో 3వ అత్యంత శక్తి వంతమైన దేశంగా ఎదుగనుందన్నారు. బిజెపి జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం, రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, మంచె రాజేష్, బతికెపెల్లి ఎంపిటిసి చింతకింది అనసూర్య, కమ్మరిఖాన్ పేట సర్పంచ్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్, జిల్లా దళితమోర్చ ప్రధానకార్యదర్శి దొనకొండ నరేష్, నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు బెజ్జారపు లవన్, సంగెపు గంగారాం, చక్రపాణి, గంగుల కొమురెల్లి, మేడివేని శ్రీధర్, సంగనవేని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News