Monday, December 23, 2024

బిజెపి మళ్లీ పూర్వ స్థితికి వెళ్లడం ఖాయం : జెడియూ

- Advertisement -
- Advertisement -

 

Nitish Kumar on BJP

పాట్నా: బిహార్‌లో ఎన్‌డీయే కూటమికి టాటా చెప్పి ఆర్‌జెడి, కాంగ్రెస్‌లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్‌ యునైటెడ్‌(జెడియూ). రెండు రోజుల్లోనే నితీశ్‌ కుమార్‌ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బిజెపి, జెడియూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బిజెపిపై విమర్శలు గుప్పించారు జెడియూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌(లలన్‌ సింగ్‌). బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకేనన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 పార్లమెంటరీ స్థానాల్లో జెడియూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బిజెపి  ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు.  మరోవైపు.. బిజెపికి 2024 ఎన్నికల్లో 50 సీట్లు మాత్రమే వస్తాయని శనివారం ఓ సమావేశం వేదికగా అంచనా వేశారు జెడియూ అధినేత నితీశ్‌ కుమార్‌. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్‌ కుమార్‌. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ‍్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News