Thursday, January 23, 2025

తెలంగాణలో పొత్తుల్లేవ్

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతోందని మరోసారి తేల్చి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాలతో పాటు ఈ సారి మరో ఆరు సీట్లులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి అభ్యర్థుల మొదటి జాబితాలో తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మిగితా 8 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి మిగిలిన 8 మంది అభ్యర్థులపై చర్చిస్తానని తెలిపారు. ఈనెల 11న ఆరుగురు అభ్యర్థులు, తరువాత మిగతా అభ్యర్థులను పేర్లు ప్రకటిస్తామన్నారు. పార్టీలో చేరికలు అనేవి నిరంతర ప్రక్రియని వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి హ్యాట్రిక్ కొడుతోందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News