Friday, December 20, 2024

2024 నాటికి దేశంలో నక్సల్స్ ఉండరు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి నక్సల్స్‌ను తుడిచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో అనేక చర్యలు చేపట్టడంతో నక్సల్స్ సమస్య చాలా వరకు తగ్గిపోయిందన్నారు.

2009లో నక్సల్స్ సంబంధిత ఘటనలు 2258 ఉంటే, 2021 నాటికి అది 519కి తగ్గిపోయిందని అమిత్ షా తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా వరకు ఫలించాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదని, కానీ మోడీ ప్రభుత్వం మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టిందని, దానివల్ల దేశంలో వామపక్షాల తీవ్రవాదం చాలా వరకు తగ్గిపోయిందన్నారు. 2014లో కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనుల కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ. 83000 కోట్లకు పెంచిందన్నారు. గిరిజనుల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలో భూపేశ్ బాఘేల్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అవినీతి కేసులు పెరిగాయని, ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారు. గత ఆరు నెలల కాలంలో ఛత్తీస్‌గఢ్‌కు అమిత్ షా రావడం ఇది రెండోసారి. ఇదివరలో ఆయన 2022 ఆగస్టు 27న ఛత్తీస్‌గఢ్‌కు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News