Thursday, January 23, 2025

బిజెపికి 200 సీట్లు కూడా రావు: మమతా

- Advertisement -
- Advertisement -

జల్పాయ్‌గురి: ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న హామీలను బూటకాలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 200 సీట్లు కూడా గెలవలేదని టిఎంసి అధినేత్రి జోస్యం చెప్పారు. శనివారం నాడిక్కడ ఒక ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన దేశ రాజ్యాంగాన్ని బిజెపి నాశనం చేస్తోందని ఆరోపించారు.

బెంగాల్ కోసం నరేంద్ర మోఈ ప్రభుత్వం ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోడీ గ్యారంటీల వలలో చిక్కుకోవద్దని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవన్నీ కేవలం బూటకాలు మాత్రమేనని ఆమె ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News