Monday, December 23, 2024

గుజరాత్ లో మెజారిటీతో గెలుస్తాం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

 

Amit Shah

గాంధీనగర్: గుజరాత్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొంది అధికార బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు చాలా కాలంగా బిజెపిని విశ్వసిస్తున్నారని, వారి కోరికలను పార్టీ నెరవేర్చిందని అన్నారు.గుజరాత్ గౌరవ్ యాత్ర మూడవ దశను ప్రారంభించే ముందు అహ్మదాబాద్ జిల్లాలోని జంజారాకాలోని ప్రముఖ మత స్థలమైన సంత్ సవయ్యనాథ్ ధామ్‌లో జరిగిన బహిరంగ సభలో షా ప్రసంగించారు. గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయం వద్ద గౌరవ్  యాత్ర ముగుస్తుంది.

“ఈ రోజు నేను ఈ జర్నలిస్టులందరి సమక్షంలో చెబుతున్నాను, 2022లో మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని. గుజరాత్ ప్రజలు బిజెపిపై విశ్వాసం ఉంచారు, బిజెపి దానిని (వారి కోరికలను) పూర్తిగా నెరవేర్చింది” అన్నారాయన. తన మొత్తం ప్రసంగంలో, ప్రచారంలో బిజెపిని దూకుడుగా టార్గెట్ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును మాత్రం షా పేర్కొనలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News