- Advertisement -
హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్‌ఏ టి. రాజా సింగ్ త్వరలో తిరిగి బిజెపిలోకి వస్తారని, ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం జరుగుతుందని, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.
‘మేము ఈ విషయంపై చర్చిస్తున్నాము. ఆయనపై సస్పెన్షన్‌ను త్వరలో ఉపసంహరించనున్నాము. అయితే తుది నిర్ణయం మాత్రం హై కమాండ్‌దే. రాజాసింగ్ సస్పెన్షన్ పాలసీ విధానపరంగా తీసుకున్నది. అయితే ఈ విషయంపై జరిగే చర్చలో నేనూ పాల్గొంటాను. అయితే తుది నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటాం’ అని కిషన్ రెడ్డి చెప్పారు. పిడి యాక్ట్ కింద ఇదివరలో అరెస్టయిన రాజాసింగ్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. రాజా సింగ్‌పై మహారాష్ట్రలో రెండు కేసులు ఉన్నాయి. అయితే వాటిపై ఇప్పటి వరకు చర్యలు లేవు.
- Advertisement -