Monday, December 23, 2024

ఈ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుంది: బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ జవదేకర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా మీడియా ప్రతినిధులు బిజెపి రాష్ట్ర కార్యాలయానికి రావద్దని, మీకు కావాల్సిన సమాచారం తామే అందిస్తామని బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి జవదేకర్ పేర్కొన్నారు. మీడియా పాయింట్‌ను బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి సోమాజిగూడలోని కత్రియలో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ మీడియా సెంటర్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ నెల రోజుల్లో బిజెపి గెలవడం అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో ప్రసంగిస్తూ బిజెపి నేతలతో కలిసి శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు. అనేక సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News