Saturday, November 2, 2024

మన మంత్రులు ఎవరో?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఈసారి పార్లమెం టు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించి భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయోత్సాహంలో ఉంది. రాష్ట్ర నాయకత్వం అనుసరించిన వ్యూహాలు, అం చనాలు ఫలించడంతో పార్టీలో ఉత్సాహపూరిత వా తావరణం నెలకొంది. ఎన్నికల సమ యం నుంచి లక్షంగా చేసుకున్న డబుల్ డిజిట్ స్థానాలు దక్కకపోయినా, సాధించిన ఎనిమిది సీట్లలో హేమా హేమీలైన సీనియర్లు ఉన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు విజయం సాధించి న నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవు లు దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా జాతీయ నాయకత్వం తనకే ప్రాధాన్యమిస్తుందనే విశ్వాసంతో ఎవరికి వారు ఉన్నా రు. మరి అగ్ర నాయకత్వం ఎవరికి మొగ్గుచూపుతుందోననే టెన్షన్ వారిలో కొనసాగుతోంది. కేం ద్రంలో ఏర్పడబోయే కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెవరికి కేంద్ర మం త్రి అవకాశం వస్తుందోననే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.

పైకి కనిపించకపోయినప్పటికీ కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌లు దక్కించుకునేందుకు కమలం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే పోటీ ఉన్నా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తొలిసారిగా బిజెపి తరఫున రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపిలు విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవులపై ఎంపిలుగా గెలిచిన వారి లో ఆశలు పెరిగాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి సహా నలుగురు ఎంపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈసారి ఎనిమి ది మంది గెలవడంతో పార్టీ ప్రజల్లోకి బాగా విస్తరించిందని కేంద్ర నాయకత్వం చాలా సంతోషం గా ఉండడంతో ఈసారి ఎన్ని మంత్రి పదవులు తెలంగాణకు ఇస్తారు, ఆ ఇచ్చే మంత్రి పదవులు ఎవరికి ఇస్తారోనని ఊహాగానాలు పెరుగుతున్నా యి. మరో వైపు ఎన్‌డిఏ ప్రభుత్వం తిరిగి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఏర్పడబోతుందనే వార్తలు రావడంతో కేంద్ర మంత్రి వర్గంలో బెర్త్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రా తినిధ్యం వహించిన జి.కిషన్‌రెడ్డికి కేంద్ర కేబినెట్ లో కిందటి సారి చోటు దక్కింది. ఈ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు.

అయితే ప్రస్తుతం కిషన్‌రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో బిజెపికి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో బిజెపి అగ్రనేతల దృష్టిలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రి పదవి రెండు నిర్వహించే అంశంలో ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కరీంనగర్ ఎంపిగా ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బండి సంజయ్‌కి కూడా అవకాశం లేకపోలేదు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన సంజయ్‌ను అనూహ్యంగా తప్పించి, కిషన్‌రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్‌గా చేయటం వల్ల అప్పట్లోనే కేంద్ర మంత్రిగా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే బండి సంజయ్‌ను అప్పుడే జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ నియమించింది. మంత్రి పదవి కోసం సంజయ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి రెండోసారి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే బండి సంజయ్ సహా ధర్మపురి అర్వింద్ ఇద్దరూ గత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని తమ తమ సిట్టింగ్ స్థానాలను నిలుపుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

కాగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగిన ఈటల రాజేందర్, మొదటి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లి విజయ దుందుభి మోగించారు. మల్కాజ్‌గిరి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపి అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానంలో తీవ్ర ద్విముఖ పోటీ నెలకొన్నప్పటికీ బిజెపి నుంచి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. నరేంద్ర మోడీ సైతం ఈ నియోజకవర్గంలో రెండు సార్లు, అమిత్‌షా ఒకసారి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలవడం పట్ల ఆయన కూడా కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానానికి 1952లో మొదటి సారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఆ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరిగినా, ఒక్క మహిళా ఎంపీ కూడా పార్లమెంటుకు ఎన్నిక కాలేదు. ఇప్పటి వరకు జె.రామశ్వరరావు, మల్లికార్జున్ గౌడ్ నాలుగు పర్యాయాలు చొప్పున, ఎస్.జైపాల్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి రెండేసి సార్లు, జనార్దన్ రెడ్డి, ముత్యాల్ రావు, డి.విఠల రావు, కెసిఆర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఒక్కో టర్మ్ ఎంపీలుగా పని చేశారు. కానీ 2019 ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేయగా 3,33,573 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

ఈ సారి ఎన్నికల్లో 5,10,747 ఓట్లు ఆధిక్యత సాధించి విజయం సాధించారు. దీంతో పార్టీలో చురుగ్గా ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరచు ఢీ అంటే ఢీ అనేటట్లు పని చేయడం, మహిళకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ వర్గాలు భావించవచ్చునని తెలుస్తోంది. డికె ఆరుణ కూడా ఈసారి గట్టి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె మాత్రం కేంద్ర మంత్రి పదవి కోసం ఎటువంటి లాబీయింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం ఏ పని అప్పచెబితే అదే చేస్తానని ప్రకటించారు. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మెదక్ ఎంపి స్థానం నుంచి రఘునందన్‌రావు విజయం సాధించారు. వీరిలో ఈ ఇద్దరు మినహా ప్రస్తుతం గెలిచిన మిగిలిన వారంతా సీనియర్లే కావడంతో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక అంచనాకు రావచ్చని పార్టీ వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News