Friday, December 20, 2024

బిజెపి దక్షిణాదిన భారీగా గెలుస్తుంది

- Advertisement -
- Advertisement -

అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది
ఎన్‌డిఎ 400 దాటుతుంది
లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని మోడీ ధీమా

భువనేశ్వర్ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) దక్షిణాదిన అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడినప్పుడు తమ ఎన్‌డిఎ కూటమి లోక్‌సభలో 400 పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోడీ మళ్లీ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పిటిఐ వీడియోస్‌కు ఆదివారం రాత్రి ఇంటరూధ్వ ఇస్తూ, ‘సమస్త దేశానికి మా వ్యూహం ఒకటే. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఔర్ చార్ జూన్ 400 పార్’ (మళ్లీ మోడీ సర్కార్, ఇంకా జూన్ 4న 400 పైగా సీట్లు)’ అని చెప్పారు. బిజెపికి దక్షిణాదిన బలం గాని, ఉనికి గాని లేదనే అపోహను తమ ప్రత్యర్థులు సృష్టించారని మోడీ ఆరోపించారు. ‘2019 ఎన్నికలను పరికించండి. అప్పుడూ దక్షిణాదిన అతిపెద్ద పార్టీ బిజెపినే. మళ్లీ ఇదే చెబుతున్నా.

ఈ దఫా దక్షిణాదిన అతిపెద్ద పార్టీగా బిజెపి కాగలదు. దాని మిత్ర పక్షాలు మరిన్ని (సీట్లు) చేరుస్తాయి’ అని ఆయన తెలిపారు. ‘మేము దక్షిణ భారత్‌లో ఏకైక పెద్ద పార్టీ కాగలం. క్రితం సారి కన్నా కూడా భారీ ఆధిక్యం సాధిస్తాం. మేము ఇప్పటికే ప్రజల మనస్సుల్లో భారీ వాటా సాధించాం. ఆ ప్రాంతంలో సీట్ల వాటాలో, వోట్ల వాటాలో పెద్ద పురోగతి చూస్తాం’ అని మోడీ చెప్పారు. 543 లోక్‌సభ సీట్లలో 131 సీట్లు దక్షిణ భారత్‌వే. ఇప్పుడు పదవీ కాలం ముగియనున్న లోక్‌సభలో దక్షిణాది నుంచి బిజెపికి 29 మంది సభ్యులు ఉన్నారు. అంతే కాకుండా బిజెపి మద్దతు ఇచ్చిన, కర్నాటక నుంచి ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. తుదకు తూర్పు భారతంలో కూడా ‘ప్రజల నుంచి బృహత్ స్థాయిలో మద్దతు చూస్తున్నాం& దీని వల్ల భువనేశ్వర్‌లో, కోల్‌కతాలో, చివరకు ఢిల్లీలో కూడా మీడియా, రాజకీయ వర్గాల్లో కొందరికి నిద్ర లేని రాత్రులు ఉంటున్నాయి’ అని మోడీ తెలిపారు.

కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు భారతంలో అభివృద్ధి లోటు గురించి ఒక సవివరణ పత్రాన్ని ఎలా ఉపయోగించుకున్నదీ మోడీ గుర్తు చేసుకుంటూ, ఎన్‌డిఎ ప్రభుత్వం ఆ ప్రాంతానికి సాధికారత కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిందని తెలియజేశారు. తత్ఫలితంగా గత దశాబ్దంలో బిజెపి ప్రభుత్వం, ఎన్‌డిఎ ప్రభుత్వం ఎంత మార్పు తీసుకురాగలదో ఆ ప్రాంతం చూసిందని ఆయన చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో ‘ఎర్ర కారిడార్’గా పేర్కొంటున్న ప్రాంతం ‘కాషాయ కారిడార్’ కాగలదు’ అని ఆయన సూచించారు. గత ఎన్నికల దశలపై మదింపులు అన్నీ ఎన్‌డిఎ ‘ధ్రువ స్థానంలో’ ఉన్నట్లు, కాంగ్రెస్ తన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరవడానికీ ఇబ్బంది పడుతున్నట్లు సూచిస్తున్నాయని ప్రధాని తెలియజేశారు. ప్రజల ఆశీస్సులు మాకు రికార్డు స్థాయి తీర్పు ఇవ్వగలవు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, ముఖ్యంగా దక్షిణాది, తూర్పు ప్రాంతం నుంచి మాకు మరిన్ని సీట్లు రాగలవు’ అని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘400 సీట్లు సాధించే దశలో ఎన్‌డిఎ ఉంది’ అని ప్రధాని తెలిపారు. ‘తొలి రోజు నుంచి మా భౌగోళిక అస్తిత్వం పరంగానే కాకుండా మా సిద్ధాంతం పరంగా కూడా’ బిజెపి సిసలైన జాతీయ పార్టీ అని మోడీ స్పష్టం చేశారు.

‘మాకు దేశం మొదట అనేది మా సిద్ధాంతానికి పునాది. బెంగాల్‌కు లేదా కేరళకు సంబంధించి మేము నిర్ణయాలు తీసుకుంటే అందుకుదేశం మొదట అనేది ప్రాతిపదిక అవుతుంది’ అని ఆయన చెప్పారు. జాతీయ ఫలితాల గురించిన ప్రశ్నకు మోడీ సమాధానం ఇస్తూ, ‘400 దాటాలని మేము నిశ్చయించుకున్నాం. నాలుగు దశల ఎన్నికల తరువాత మా అంచనా సరైనదే అని దృఢవిశ్వాసంతో చెప్పగలను. మా అంచనాకు మించి ప్రజల దృఢనిర్ణయం మరింత బలంగా ఉంది’ అని చెప్పారు. దక్షిణాదిలో బిజెపి దుర్బలం అన్న కథనం పార్టీని పట్టణ ప్రాంత ప్రాధాన్య, పురుషుల ప్రాధాన్య, ఉత్తరాది ప్రాధాన్య, ‘బనియా బ్రాహ్మణ’ పార్టీగా చిత్రించిన ప్రచారంలో భాగం అని ప్రధానిపేర్కొన్నారు.

‘ఒక అపోహను వ్యాప్తి చేశారు. జాతిని తప్పుదారి పట్టించేందుకు, దేశాన్ని నాశనం చేసేందుకు రకరకాల అపోహలు సృష్టిస్తున్న వాతావరణం మన దేశంలో సంవత్సరాలుగా సాగుతోంది’ అని ఆయన ఆరోపించారు. ‘మాది బనియా బ్రాహ్మణ పార్టీ అని కూడా పేర్కొన్నార. కానీ అధిక సంఖ్యాక దళిత, ఒబిసి, ఆదివాసీ ఎంపి/ ఎంఎల్‌ఎలు బిజెపి నుంచే ఉన్నారు. వారు దీనిని ఉద్దేశపూర్వకంగా చేస్తుంటారు. మాకు దక్షిణాదిన ఉనికి లేదనే అపోహను అదే విధంగా వ్యాప్తి చేశారు’ అని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News