Monday, December 23, 2024

అరుణాచల్ లో బిజెపి, సిక్కింలో ఎస్ కెఎం ఘన విజయం

- Advertisement -
- Advertisement -

అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే మేజిక్ ఫిగర్ 31 సీట్లను గెలుచుకుంది బిజెపి. ఇందులో  పోలింగ్ కు ముందే 10 సీట్లు ఏకగ్రీవంగా గెలుపొందింది. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్ పిపి రెండు స్థానాల్లో.. పిపిఎ, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు. అరుణాచల్ లో బిజెపి మెజార్టీ స్థానాల్లో గెలుపొందనుంది. దీంతో బిజెపి అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఇక, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఎస్ కెఎం విజయం సాధించింది. మొత్తం 32 స్థానాల్లో.. మేజిక్ ఫిగర్ 17 దాటి 18 సీట్లను ఎస్ కెఎం పార్టీ గెలుచుకుంది. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి సిఎంగా బాధ్యతలు చేపట్టానున్నారు.

కాగా ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంమైంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల ల్లోపు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News