Thursday, January 23, 2025

తెలంగాణలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అన్ని పార్టీల కంటే బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్‌ను కిషన్ రెడ్డి దాఖలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డితో పాటు నిమినేషన్ సమర్పణలో ఎంపి లక్ష్మణ్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపిగా మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చివరి శ్వాస వరకు బిజెపి జెండా కోసమే పని చేస్తానని, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని, బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బిజెపి సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో నల్లకుంటలోని శంకర మఠ్ ఆలయంలోని శ్రీ శృంగేరి అమ్మవారు, శివుని సన్నిధిలో నామినేషన్ పత్రాలను కిషన్ రెడ్డి ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News