Monday, December 23, 2024

మహాలో అఘాడీకి 3 బిజెపికి 3

- Advertisement -
- Advertisement -

bjp wins 3 of 6 rajya sabha seats in maharashtra

ఉద్ధవ్‌కు దెబ్బ .. దేవేంద్రకు ఊతం

ముంబై : మహారాష్ట్రలో సిఎం ఉద్ధవ్ థాకరే వ్యూహలేమికి అద్దం పడుతూ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు నిలిచాయి. ఇక్కడ శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల ఫలితాల ప్రకటన శనివారం తెల్లవారుజాము వరకూ తీవ్రస్థాయి వాదోపదవాదాల నడుమ నిలిచిపోయింది. తరువాత ప్రకటించారు. ఇక్కడ ఎనిమిది గంటల పాటు ఫలితాన్ని నిలిపివేయడాన్ని అధికార అఘాడీ ప్రశ్నించింది. ఇక్కడ విజేతలలో శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎన్‌సిపి నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి అధికార పక్షం నుంచి గెలిచారు. పోలయిన 248 ఓట్లలో క్రాస్ ఓటింగ్ సరళి కన్పించింది. బిజెపి తరఫున పోటీ చేసిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్, మాజీ మంత్రి అనిల్ బొండే, ధనంజయ్ మహదిక్ గెలిచారు. ఇక ఆరవ స్థానానికి జరిగిన తీవ్రస్థాయి పోటీలో బిజెపి తరఫున మాజీ ఎంపి ధనంజయ్ మహదీక్, శివసేన తరుఫున సంజయ్ పవార్ బరిలోకి దిగారు. వీరిలో పవార్ ఓడారు. ఎమ్మెల్యేలకు గాలాల పరస్పర ఆరోపణలతో ఆరవ స్థానానికి తీవ్ర పోటీ జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ ఎన్నికలలో గెలిచేందుకు పోటీ పడుతారు. కేవలం బరిలోకి దిగేందుకు కాదని అన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ మకెన్‌కు షాక్
తెల్లవార్లూ హైద్రామా విజేతగా బిజెపి మద్దతు అభ్యర్థి

హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇక్కడ రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బిజెపికి చెందిన కృషన్ లాల్ పన్వర్, బిజెపి మద్దతు దక్కిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలిచినట్లు ఆద్యంతం హైడ్రామా తరువాత ప్రకటించారు. నిబంధనలు బేఖాతరు, ఎమ్మెల్యేలకు గాలాల పరస్పర ఆరోపణలతో కౌంటింగ్ ఏడు గంటల పాటు నిలిచిపోయిన తరువాత ఉదయం విజేతల పేర్లు ప్రకటించారు. ఈ దశలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మకెన్ ఓడిపోవడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా మారింది. అజయ్ మకెన్‌కు అవసరం అయిన ఓట్లు రాలేదని, పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్, ఓ ఓటు చెల్లకుండా పోవడంతో మకెన్ పరాజయం పాలయ్యారు. విజేతలిద్దరిని అభినందిస్తూ తెల్లవారుజామున హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వారితో కలిసి ఫోటోలు దిగారు. అంతకు ముందు తాను గెలిచినట్లు తెలిసిందని సంబరాలు నిర్వహించుకున్న మకెన్ మద్దతుదార్లతో కలిసి ఫోటోలు దిగి, ట్విట్టర్‌లో పెట్టారు. తరువాత ఓడిన దశలో ఈ ఫోటోలను ట్వీట్లను తొలిగించారు.

హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్‌పై వేటు

కాంగ్రెస్ ఓటింగ్‌కు పాల్పడి , పార్టీ అభ్యర్థి మకెన్ ఓటమికి బాధ్యులుగా తేలినందున హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి తీసివేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే పార్టీ సభ్యత్వం నుంచి తొలిగిస్తున్నట్లు తెలిపారు. హర్యానాలో అదంపూర్ నుంచి బిష్ణోయ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News