Saturday, April 5, 2025

అస్సాంలో బిజెపి మహిళా నేత హత్య

- Advertisement -
- Advertisement -

గోల్‌పరా(అస్సాం): అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో సోమవారం బిజెపి నాయకురాలి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి ఆమె మృతదేహాన్ని 17వ నంబర్ జాతీయ రహదారిపై పడేశారు.

బిజెపి జిల్లా కార్యదర్శి జోనాలీ నాథ్‌ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణయ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సల్సారా ప్రాంతంలో జాతీయ రహదారిపై పడేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం గోల్‌పరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను వేరే ప్రదేశంలో చంపి మృతదేహాన్ని జాతీయ రహదారిపై తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News