Saturday, April 19, 2025

రాహుల్ రాకలో తప్పేముంది?: బిజెపి నాయకురాలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో గురువారం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించడంలో తప్పేమీ లేదని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు అధికారిమయుమ్ శారదాదేవి తెలిపారు. రాహుల్ రాకను ఆమె శనివారం ఇక్కడ సమర్ధించారు. రాహుల్ ఇక్కడికి వచ్చిన నిర్వాసితులను పరామర్శించి వెళ్లారని, దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మణిపూర్ పర్యటన కొనియాడదగినదని, అయితే ఎవరైనా ముందు రాష్ట్రంలో మునుపటి సాధారణ పరిస్థితి నెలకొనేలా చేయాల్సి ఉందన్నారు. అత్యంత సున్నితమైన ప్రస్తుత పరిస్థితిలో రాజకీయాలకు పాల్పడటం భావ్యం కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News