Wednesday, January 22, 2025

రాబోయే ఎన్నికల్లో బిజెపిదే అధికారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దామెర: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రకాల నియోజకవర్గంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని బిజెపి పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దామెర మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు జంగిలి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ విజయచందర్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ వాగ్ధానాలు వర్షాలు కురిపించి అందలం ఎక్కగానే హామీలను విస్మరించారన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ప్రభుత్వమే ఇస్తుందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విజయచందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, దామెర సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి, పరకాల అసెంబ్లీ కోకన్వీనర్ మాదారపు రతన్‌కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్‌కుమార్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంకిడి బుచ్చిరెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సుధాకర్, సీనియర్ నాయకుడు ఎక్కలదేవి రమేశ్, సండేసారి సంతోష్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News