Saturday, November 23, 2024

గోవాలో క్యాంపులు లేనట్టే!

- Advertisement -
- Advertisement -

బిజెపికి ఎంజిపి మద్దతుతో సోమవారం సావంత్ ప్రమాణం?

పనాజీ /న్యూఢిల్లీ: గోవాలో బిజెపి ప్రభుత్వ స్థాపనకు రంగం సిద్ధమైంది. ఇక్కడి ప్రాంతీయ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎం జిపి) ఈసారి బిజెపి ప్రభుత్వ స్థాపనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. గోవాలో ఇప్పుడు బిజెపి , మిత్రపక్షాలకు కలిపి 25 స్థానాలు వచ్చాయి. మొత్తం 40 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి ప్రభుత్వ స్థాపనకు ఇతర పక్షాల తోడ్పాటు అత్యవ సరం. గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక ల ఫలితాల ఘట్టం మొదలైన దశలోనే వివిధ రాజకీయ పార్టీల మధ్య బేరసారాల ప్రక్రియ ఆరంభం అయింది. అన్ని అం శాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత గోవా బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రతినిధులు గురువారమే గోవా గవర్నర్‌ను కలిసింది.

ప్రభుత్వ స్థాపనకు తమకు ఆహ్వానం పంపించాలని, తగు బలం నిరూపించుకుం టామని తెలిపింది. ఈలోగానే ఎంజిపి తాము బిజెపికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. తమకు ముగ్గురు ఇండి పెండెంట్ల మద్దతు కూడా దక్కిందని అసెంబ్లీలో బలం నిర్ధా రించుకుంటామని స్పష్టం చేసింది. సోమవారం తమ ప్రభు త్వ ప్రమాణస్వీకారం ఉంటుందని బిజెపి వర్గాలు తెలిపా యి. ఈ తీర ప్రాంత రాష్ట్రంలో ఇప్పుడు ప్రాం తీయ పార్టీ ఎంజిపి వైఖరే కీలకం అయింది. ఎంజిపి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దశలో మమత బెనర్జీ నాయకత్వపు టిఎంసితో మిత్ర పక్షంగా ఉంది. అయితే ఈ ఎ న్నికల ఒప్పందాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఎంజిపి బిజెపి తో కలిసి ముందుకు వెళ్లేందు కు సిద్ధమైంది. గోవాలో బిజెపి సిఎం అభ్యర్థి ప్రమోద్ సావం త్ ఇప్పటికే తమ సంక్యీ లమ్ స్థానంలో ఆధిక్యత లో ఉన్నారు. గోవాలో ఆప్ 3 సీట్ల ను దక్కించు కుంది. ఇక కాంగ్రెస్‌కు 12 సీట్లు ఖరారయ్యాయి. గోవాలో అధికారంలోకి రావాలంటే రాజకీయ పక్షా లు పాతిక సీట్ల బలం చాటు కోవల్సి ఉంటుంది.

ఈ దిశ లో బిజెపికి ఇప్పుడు అన్ని వి ధాలుగా ఎంజిపి మద్దతుతో అ ధికారం చేజిక్కేందుకు మార్గం సు నాయాసం అయింది. గోవాలో బిజెపి అ న్ని స్థానాలకు పోటీ కాంగ్రెస్ ఇక్కడి గోవా ఫార్వర్డ్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రచార సారథ్య బాధ్యతలను సీనియర్ నేత చిదంబరం తీ సుకున్నారు. ప్రజా తీర్పును తమ పార్టీ అంగీకరిస్తుందని తెలిపారు. తమ కు స్థానాలు అం దించిన ప్రజల కు తెలిపారు. గో వాలో ప్ర జలు తమ పార్టీ నే తలు కొందరి ని ఆమోదించ లేదని, అయితే లో పం వారిలో లేదన్నా రు. వచ్చే ఎన్నికలతో నిమిత్తం లే కుండా ప్రజలకు అందుబాటు లో ఉంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News