Sunday, January 26, 2025

యుపిలో బిజెపి, బీహార్ లో ఆర్జెడి అభ్యర్థుల గెలుపు

- Advertisement -
- Advertisement -

Neelam Devi-RJD

న్యూఢిల్లీ: హర్యానాలోని ఆదంపూర్, మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, ఒడిశాలోని ధామ్‌నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోకర్‌నాథ్, బీహార్‌లోని గోపాల్‌గంజ్, మోకామా, తెలంగాణలోని మునుగోడుకు ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోకర్‌నాథ్ స్థానాన్ని బిజెపి తిరిగి గెలుచుకుంది. బిజెపి అభ్యర్థి అమన్ గిరి రికార్డు మార్జిన్‌తో సమాజ్‌వాదీపార్టీకి చెందిన అభ్యర్థి వినయ్ తివారీని ఓడించారు. ఆయన దివంగత తండ్రి స్థానంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. ఇక ఆర్‌జెడికి చెందిన అభ్యర్థి నీలం దేవీ తన భర్త ఖాళీ చేసిన స్థానంలో గెలుపొందారు. ఆమె భర్త అనంత్ సింగ్ సాయుధ చట్టం కేసులో ధోషిగా తేలడంతో పదవి నుంచి తొలగాల్సి వచ్చింది. తెలంగాణలోని మునుగోడులో కె. ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకైతే స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News