Sunday, January 19, 2025

200 సీట్లు బీజేపీకి రావడం కష్టమే : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అదే సమయంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 మార్కును కూడా దాటలేదని అన్నారు. ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం లోని గోఘాట్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. “ఇండియా కూటమి పేరు పెట్టింది నేనే. బీజేపీని ఓడించేందుకు నేతలు పనిచేస్తున్నారు. అదే ఇండియా కూటమిని అధికారం లోకి తెచ్చేందుకు టీఎంసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.” అని ఆమె పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్, సీపీఐ (ఎం)లు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని, బీజేపీకి లబ్ధి చేకూర్చే టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేయవద్దని ఆమె ఓటర్ల ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News