Friday, April 4, 2025

బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు…. బిజెపి కార్యకర్త, యూట్యూబర్ ను చితకబాదిన మహిళలు

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ ప్రాంతంలో యూ ట్యూబర్, కాషాయ కార్య‌క‌ర్త దార‌మోని గిరీష్ ను   బిజెపి మ‌హిళా కార్య‌క‌ర్త‌లు బట్టలు ఊడదీసి కొట్టి, చెప్పులు మెడకు వేసి పోలీసుల ముందే ఉరికించారు. జర్నలిస్ట్ ముసుగులో యూ ట్యూబ‌ర్ అయిన‌ గిరీష్ దారమోని ‘ద చిత్ర‌గుప్త్’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడుతున్నాడు. జ‌ర్న‌లిస్టుగా ఎక్క‌డా ప‌నిచేయ‌లేదు, ప‌క్కా బిజెపి కార్య‌క‌ర్త‌, నిత్యం బ‌లుపు మాట‌ల‌తో త‌న యూ ట్యూబ్ లో విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఇద్దరు బిజెపి నాయకుల ప్రోద్భలంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా, అసత్య ప్రచారానికి తెర తీసి మ‌హిళ‌తో లేని సంబంధాన్ని అంట‌గ‌ట్టాడు. బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో చురుగ్గా పాల్గొని, అనేక ఉద్యమాలు చేపట్టి జైలుకు వెళ్లిన మహిళా కార్యకర్తపై గిరీష్ అస‌హ్య‌ంగా, అనుచిత విమ‌ర్శ‌లు చేశాడు.

అన్నాచెల్లెళ్లాంటి వాళ్లకు అక్రమ సంబంధం అంటగడుతూ తన యూట్యూబ్ ఛానల్ లో అసత్య ప్రచారం చేశాడు. త‌న‌పై అస‌హ్య‌క‌ర‌మైన‌ వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన మహిళా కార్యకర్తలపై గిరీష్ త‌న ఆఫీసులో మిర‌ప కారం పొడితో దాడి చేశాడు. దాంతో ఆగ్రహించిన మహిళా కార్యకర్తలు గిరీష్ మెడకు చెప్పులు వేసి, బట్టలు ఊడదీసి దేహశుద్ధి చేసి ఉరికించారు.

ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని గిరీష్ కు మహిళా కార్యకర్తల హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే మరోసారి దాడి చేస్తామని, న‌గ‌ర వీధుల్లో ఊరేగిస్తామ‌ని తీవ్రంగా హెచ్చరించారు. పైస‌లు ఉన్నాయ‌ని ప్ర‌తివాడు యూ ట్యూబ్ ప‌ట్టుకుంటే గిట్ల‌నే దేహ‌శుద్ది ఉంటుందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News