Thursday, January 23, 2025

బెంగళూరులో మహిళను బెదిరించిన బిజెపి ఎంఎల్ఏ

- Advertisement -
- Advertisement -

Arvind Limbavali

బెంగళూరు: తన ఆస్తిని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఓ మహిళ గోడు చెప్పుకోడానికి ముందుకురాగా ఆమెను కర్ణాటక బిజెపి ఎంఎల్ఏ అరవింద్ లింబావలి  బెదిరించి, మాటలతో దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత ఆమెను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, వెంటనే వెనక్కి పంపించారు. అధికారిక పనిలో జోక్యం చేసుకున్నందుకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ వీడియోను షేర్ చేస్తూ, మహిళలకు భద్రత కల్పిస్తామన్న హామీపై బిజెపి వంచనకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘ మహిళతో మీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అరవింద్ లింబావలి అనుచితంగా ప్రవర్తించిన తీరు క్షమించరానిది’ అని బిజెపి నేత క్షమాపణలు కోరుతూ కన్నడలో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News