- Advertisement -
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పాలనకు మధ్య ఏ మాత్రం తేడా లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ గ్యారంటీల గారడీ…6 అబద్ధాలు, 66 మోసాలు’ పేరుతో బిజెపి అభియోగపత్రం(ఛార్జ్ షీట్) విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను చేసి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడం లేదు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని, ఏడాది గడిచినా పూర్తి చేయలేకపోతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించని ఈ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజలు నివ్వెర పోతున్నారు’’ అన్నారు.
- Advertisement -