Monday, December 23, 2024

మూడో జాబితాపై బిజెపి కసరత్తు బిసిలు, మహిళలకు ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై పార్టీ అగ్రనేతలతో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో బిజెపి మూడో జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. మూడో జాబితాలో మహిళలు, బిసిలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఈ నెల 22న 52 మంది అభ్యర్ధులతో బిజెపి తొలి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 27న బిజెపి రెండో జాబితాను విడుదల చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపి ఎపి జితేందర్ రెడ్డి తనయుడు ఎపి మిథున్ రెడ్డి పేరును బిజెపి ప్రకటించింది. ఈ ఒక్క పేరు తోనే రెండో లిస్ట్ విడుదలైంది. మూడో జాబితా కోసం బిజెపి నాయకత్వం కసరత్తు చేస్తుంది.

ఇతర పార్టీల నుండి వచ్చే నేతలకు కూడ మూడో జాబితాలో టిక్కెట్ల కేటాయించే అవకాశం లేకపోలేదు. ఇంకా 66 సీట్లను బిజెపి ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లను ఇవ్వాలని జనసేన కోరుతుంది. అయితే 10 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించేందుకు బిజెపి సుముఖంగా ఉంది. ఈ విషయమై పార్టీ అగ్రనేతలతో కిషన్‌రెడ్డి చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News