Saturday, December 21, 2024

16న బిజెపి తొలి జాబితా!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోజాతీయ నేతలతో కిషన్ రెడ్డి మంతనాలు
బిసిలకు 40 సీట్లుకు కసరత్తు

మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను కార్యక్షేత్రంలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి కూడా అభ్యర్థుల జాబితా విడుదలపై దృష్టి సారించింది. శుక్రవారం ఢిల్లీలో జాతీయ నేతలతో బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. తొలి జాబితా విడుదలపై అగ్రనేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమవ్వగా.. దీనికి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నెల 15, 16వ తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.

ఈ భేటీలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం తొలి జాబితాను బిజెపి ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల అంశాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. బిసి నినాదంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు కమల దళం ప్రణాళికలు రచిస్తోంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిసిలకు అన్యాయం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బిసిల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి నాయకత్వం.. 88 జనరల్ నియోజకవర్గాల్లో 35 నుంచి 40 టికెట్లు బిసిలకు కేటాయించే యోచనలో ఉంది. రాష్ట్రంలో కీలక బిసి నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడు వన్నె ఈశ్వరప్ప బిజెపిలో చేరారు. అదే విధంగా ముదిరాజ్ నేతలు, ఇతర బిసి కులాలకు చెందిన ముఖ్యనేతలు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News