Thursday, January 23, 2025

52 మందితో బిజెపి తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

శాసనసభ బరిలో ముగ్గురు ఎంపిలకు అవకాశం
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అదే స్థానాలు కేటాయింపు
ఈటలకు హుజురాబాద్‌తో పాటు గజ్వేల్
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
కీలక స్థానాల బరిలో 12 మంది మహిళలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపిగా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మరోవైపు కోరుట్ల అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపిగా ఉన్న ధర్మపురి అరవింద్, బోథ్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావును ప్రకటించారు. తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు ప్రకటించక పోవడం విశేషం.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గజ్వేల్, హుజూరాబాద్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. రాజేందర్ సిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయగా, ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 12 మంది మహిళలు, 20 మంది బిసిలు, 18 మంది ఓసిలు, 8 మంది ఎస్సీ, నలుగురు ఎస్టీ అభ్యర్థులకు బిజెపి స్థానం కల్పించింది. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. బిఆర్‌ఎస్ నుంచి పార్టీలో చేరిన బోగ శ్రావణికి జగిత్యాల, రామగుండం-లో కందుల సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు మానకొండూరు స్థానాన్ని కేటాయించారు. సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమను ప్రకటించారు. తొలి జాబితాలో 52 మందితో పేర్లును ప్రకటించారు.
పలువురి పేర్లు గల్లంతు…
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీటును ఆశించిన మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం రాకపోవడంతో పాటు ఆ స్థానంలో నోముల దయానంద్‌గౌడ్‌కు ఈ సీటు ఖరారు చేశారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన విజయశాంతి, డికె అరుణ, వివేక్ వెంకట్ స్వామి, లక్ష్మణ్ పేర్లు ఈ జాబితాలో దక్కలేదు.

బిజెపి అభ్యర్థుల తొలి జాబితా:
1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి- ఎ.శ్రీదేవి
3.ఖానాపూర్ -రమేష్ రాథోడ్
4.ఆదిలాబాద్- పాయల్ శంకర్
5.బోథ్-సోయం బాపూరావు
6.నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7.ముథోల్- రామారావు పటేల్
8. ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి
9.జుక్కల్- టి.అరుణతార
10.కామారెడ్డి -కె.వెంకటరమణ రెడ్డి
11. నిజామాబాద్ (అర్బన్) -ధన్‌పాల్ సూర్యనారాయణ
12.బాల్కొండ- ఏలేటి అన్నపూర్ణమ్మ
13. కోరుట్ల- ధర్మపురి అరవింద్
14. జగిత్యాల- డాక్టర్ భోగ శ్రావణి
15.ధర్మపురి- ఎస్. కుమార్
16.రామగుండం- కందుల సంధ్యారాణి
17.చొప్పదండి- బొడిగె.శోభ
18.సిరిసిల్ల -రాణిరుద్రమ రెడ్డి
19.మానకొండూరు- ఆరేపల్లి. మోహన్
20.హూజూరాబాద్ -ఈటల రాజేందర్
21.నర్సాపూర్- ఎ.మురళీయాదవ్
22.పటాన్ చెరు- నందీశ్వర్ గౌడ్
23.దుబ్బాక -రఘునందన్ రావు
24.గజ్వేల్ -ఈటల రాజేందర్
25.కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
26.ఇబ్రహీంపట్టణం- నోముల దయానంద్ గౌడ్
27.మహేశ్వరం- అందెల శ్రీశైలం యాద్
28.ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
29.కార్వాన్- అమర్ సింగ్
30.గోషామహల్- రాజాసింగ్
31.చార్మినార్ -మేఘారాణి
32.చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
33.యాఖత్ పురా -వీరేందర్ యాదవ్
34.బహదూర్ పుర -వై. నరేష్ కుమార్
35.కల్వకుర్తి- టి. ఆచారి
36.కొల్లాపూర్ -ఎ.శ్రీధర్ రావు
37.నాగార్జునసాగర్- కె.నివేదిత రెడ్డి
38.సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
39.భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి
40.తుంగతుర్తి- కడియం రామచంద్రారావు
41.జనగామ- ఎ.దశమంత్ రెడ్డి
42.స్టేషన్ ఘన్ పూర్ -ఎ. విజయరామారావు
43.పాలకుర్తి- రామ్మోహన్ రెడ్డి
44.డోర్నకల్- భూక్యా సంగీత
45.మహబూబాబాద్- జానోత్ హుస్సేన్ నాయక్
46.వరంగల్ పశ్చిమ- రావు పద్మ
47.వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్ రావు
48.వర్ధన్నపేట- కొండేటీ శ్రీధర్
49.భూపాలపల్లి- చందుపట్ల కీర్తి రెడ్డి
50.ఇల్లెందు -రవీంద్రనాయక్
51.భద్రాచలం- కుంజా ధర్మారావు
52. కరీంనగర్- బండి సంజయ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News