Sunday, January 19, 2025

దేశాభివృద్దిపైనే నిత్యం బిజెపి దృష్టి

- Advertisement -
- Advertisement -

విపక్షాలు ఎప్పుడుూ ఎన్నికల కోసం ఎదురుచూపులు: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  దేశాభివృద్దిపైనే బిజెపి దృష్టి ఎప్పుడూ ఉంటుందని, విపక్ష పార్టీల దృష్టి ఎన్నికలపై ఉంటుందని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం తమ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో శంకర్‌పల్లి పట్టణ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా ఆధ్వర్యంలో రెండు వందల మంది కార్యకర్తలు, సర్పంచ్ ఇంద్ర, లక్ష్మణ్ ఆధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ఒక విజన్‌తో పని చేసేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు.

ప్రజాస్వామ్యంలో మార్పులు సహజమని, ప్రజలు మెచ్చిన ప్రభుత్వాలు వస్తాయని దేశ, విదేశాలలో ప్రధాని మోడీ పేరు మార్మోగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఒక సర్వేలో గొప్ప ప్రధానమంత్రి ఎవరని అడిగితే 63 శాతం మంది నరేంద్ర మోడీ పేరు చెప్పారన్నారు. అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ దేశాధినేతలను కాదని, మోడీనే గొప్ప ప్రధానిగా పేర్కొన్నారన్నారు. భారతదేశం 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఎదుగుతుందన్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రమని చెప్పి ధనమంతా కాళేశ్వరంలో కుమ్మరించారని బిఆర్‌ఎస్ నేతలను దుయ్యబట్టారు. దీంతో కెసిఆర్ కుటుంబ సభ్యులు ధనవంతులయ్యారని తెలిపారు. ఉచిత బియ్యం , వరికి మద్దతు ధర, సబ్సిడీపై యూరియా ఇస్తుంది మోడీయేనన్నారు. తెలంగాణకు అన్ని విధాల బిజెపి సహాయపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, విశ్వా రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గాయత్రి, రాజ కుమార్, రాజాచంద్ర, రాజేంద్ర సింగ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News