Tuesday, November 5, 2024

రాష్ట్రంలోబీజేపీ గ్రాఫ్ పడిపోయింది

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర చీఫ్ , కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపి గ్రాఫ్ మొత్తం పడిపోయిందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. గురువారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడుతూ కాంట్రవర్సీతో పతాక శీర్షికలో ఉండాలన్న బండి ఆలోచన సరికాదని మండి పడ్డారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఉన్న మూడు సీట్లు కూడా రావని అన్నారు. ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ప్రచారం కు వెళ్లిన బండి సంజయ్ కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ఆరోపిం చారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల గూర్చి బండికి చెప్తూ రివర్స్ అటాక్ చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కొరకు కేంద్రం నుండి ఏం నిధులు తీసుకొచ్చావో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని నన్ను ప్రాదేయపడిన మాట వాస్తవం కాదా అని గుర్తు చేశారు. రాజకీయాలలోకి కుటుంబ సభ్యులను లాగడం విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడి లక్షణం కాదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది , అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్నారని, దీనిని ప్రతి పక్షాలు ఓర్వలేక లేని పోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

రాబోయో ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర చీఫ్, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రచారం చేయడం చూస్తే విడ్డురంగా ఉందన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని స్పష్టం చేశారు.

కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఎక్కువ శాతం తెలంగాణకే వస్తున్నాయని….దీంతో అభివృద్ది ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని బండి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బండి మాట్లాడే ముందు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని హితువు పలికారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, దండబోయిన రాము, పెండ్యాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News