Wednesday, January 22, 2025

లీకేజీలో రాజకీయ కుట్ర!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ స్కామ్ వెనుక ఉన్న సూత్రదారుల కనిపెట్టాలని, దీనిపై డిజిపి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ట్వీట్ చేశారు. అమాయక యువత జీవితాలను నాశనం చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో తెలంగాణ డిజిపి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని ఆయన కోరారు. నిదింతుడు రాజ శేఖర్ బిజెపి కార్యకర్తగా పేర్కొంటూ కెటిఆర్ ఫొటోలు ట్వీట్ చేశారు. మరోవైపు టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంలో బిజెపి హస్తం ఉందంటూ సోషల్ మీ డియాలోనూ వార్తలు చక్కర్లు కొడుతున్నా యి. ఈ కేసులో ఎ2గా ఉన్న అట్ల రాజశేఖ ర్ రెడ్డి బిజెపి కార్యకర్త కావడం పలు అ నుమానాలకు తావిస్తోంది. చొప్పదండికి చెందిన అట్ల రాజశేఖర్ బిజెపిలో చురుకైన కార్యకర్త కావడం.. ఆ పార్టీ ఐటి సెల్‌లో ప నిచేయడం దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

బిజెపికి యువతను దూరం చే సేందుకే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నో టిఫికేషన్లు ఇస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షు డు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యల ను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తు న్నారు. రాజశేఖర్ బిజెపి తరపున ప్రచారం చేస్తున్న ఫొటోలు, ఆయన తన సోషల్ మీ డియా అకౌంట్‌లో బిజెపికికి మద్దతుగా పె ట్టిన పోస్టులను నెటిజన్లు రీ పోస్ట్ చేసి ఇదం తా బిజెపి కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రం లో వేలాది ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండటం, యువత పూర్తిగా తమ సమయాన్ని ప్రిపరేషన్ కోసమే కేటాయిస్తుండటంతో.. ఎలాగైనా ఈ వాతావరణాన్ని చెడగొట్టి, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి.. తమవైపు తిప్పుకోవాలని బిజెపి ఒక పథకం ప్రకారమే టిఎస్‌పిఎస్‌సిలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న తమ కార్యకర్తను అట్ల రాజశేఖర్‌ను అడ్డం పెట్టుకొని ఈ కుట్రకు పూనుకుందన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి కెటిఆర్ వివిధ సమావేశాలలో యువత కొంతకాలం రాజకీయాలకు, సోషల్ మీడియాకు, ఫోన్లకు దూరంగా ఉండాలని, తమ తల్లితండ్రుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదవాలని విజ్ఞప్తి చేయడం యువతను విపరీతంగా ఆకర్షించింది. అదే క్రమంలో రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి విద్యార్థులు, యువత ఒక్క 8 నెలలు సమయాన్ని తన కోసం కేటాయించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేయడం గమనార్హం.

బిజెపిపై మండిపడుతున్న నెటిజన్లు

బిజెపి పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ ఫోటోను, కిషన్ రెడ్డిని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ క్రిశాంక్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ఎ2 నిందితుడు రాజశేఖర్ బిజెపి కోసం పనిచేస్తున్నాడు… ఇది తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి కుట్రనా..? అని క్రిశాంక్ ట్విట్టర్‌లో ఆరోపించారు. క్రిశాంక్ ట్వీట్‌పై నల్లబాలు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోఫికేషన్లు ఇచ్చి యువతను బిజెపికి దూరం చేస్తుందని బండి సంజయ్ మాట్లాడినప్పుడే అర్థం అయ్యింది. వీళ్లు ఏదో ఒకటి చేఇస ఉద్యోగాలు ఆపే కుట్ర చేస్తారు అని కామెట్ చేశారు. రాజకీయాలు ఇంత దిగజారి చేయాలంటే ఒక్క బిజెపి పార్టీ నాయకులకే సాధ్యం…కుట్రల కేరాఫ్ అడ్రస్ బిజెపి అని నాగరాజు అనే నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇలా…వందలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో బిజెపిపై విరుచుకపడుతున్నారు. బిఆర్‌ఎస్ మీద ఉన్న కసిని బిజెపి నాయకులు నిరుద్యోగుల మీద చూపిస్తున్నారని మండిపడుతున్నారు. అధికారం పొందడం కోసం ఇలా నిరుద్యోగులను బలిచేయొద్దని అందుకు వేరే దారులు వెతుక్కోవాలని బిజెపి నాయకులను వేడుకుంటున్నారు. తమ రాజకీయ లబ్ది కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి రాజకీయాలను రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా యువత నిశితంగా గమనిస్తూ సోషల్ మీడియా వేదికగా బిజెపికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News