Monday, December 23, 2024

బిజెపి హిందూత్వం ఓ డ్రామా: శివ కుమార్

- Advertisement -
- Advertisement -

బెల్గావి: ‘బిజెపి హిందూత్వం ఓ డ్రామా’ అని కర్నాటక కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు డికె. శివ కుమార్ సోమవారం అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అనుసరించే హిందూత్వం కన్నా తాను, ఇతరులు అనుసరించే హిందూత్వం ఎంతో మేలైనది అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగంనే ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు.

“మనమంతా హిందువులం, మనం హిందువులంగానే పుట్టాం, మనం హిందువులుగానే చనిపోతాం. బిజెపి వాళ్ల హిందూత్వం కన్నా మనం ఆచరించే హిందూత్వం గొప్పది. వారిదంతా నాటకం(డ్రామా). కానీ మనది మనలో జీర్ణించుకుని ఉన్నది” అన్నారు. బిజెపి హిందూత్వంపై, వారి హిందూత్వ ఎజెండాపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ జవాబిచ్చారు. “మన భావాలు, భక్తి, ఆచరణ, మన క్రతువులు, ఆదర్శాలు హిందుత్వంకు సంబంధించినది. మనము ప్రచారం చేసేది రాజ్యాంగం గురించే” అని ఆయన చెప్పుకొచ్చారు.

‘సువర్ణ విధాన సౌధ’ అసెంబ్లీ ఛాంబర్‌లో హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ నిలువెత్తు చిత్రపటాన్ని , ఇతర జాతీయ నాయకుల చిత్రపటాలని ఆవిష్కరించిన తర్వాత శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. విధాన సౌధలో చిత్రపటాలని ఆవిష్కరించడమన్నది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అని, తమని అంధకారంలో ఉంచి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News