Friday, November 15, 2024

పార్టీ పిరాయింపులు, చీల్చడం బిజెపి ఉద్దేశ్యం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రాజకీయాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని అందుకు ఉదాహరణ గతంలో మధ్యప్రదేశ్‌లో పార్టీ పిరాయింపులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, బిజెపి ప్రభుత్వం అధికారంలోరావడం, అదేవిధంగా మహారాష్ట్రంలో శివసేన పార్టీని చీల్చేయడం, అక్కడ ఉన్న పార్టీని పడగొట్టటం, ఇవన్నీ కూడా దేశ ప్రజాస్వామానికి మంచి పరిణామాలు కాదని పేర్కొన్నారు.

సైద్యాంతమైన పార్టీలు ఈ విధమైన పార్టీ పిరాయింపులకు ప్రోత్సాహించే కార్యక్రమాలు, పార్టీలను చీల్చే కార్యక్రమాలు కేవలం ప్రభుత్వంలో తమ పార్టీ ఉండాలనే వంకర బుద్దితో వ్యవహరిస్తుందని తెలిపారు. దేశంలో యొక్క జిడిపి పడిపోతుందని అప్పుల ఊబిలో పడిపోయిందని, దాదాపు 65 సంవత్సరాల ముందు పరిపాలించిన పార్టీలు 57 లక్షల కోట్లు తీసుకుంటే 9 సంవత్సరాల కాలంలో మోడీజీ వంద లక్షల కోట్ల రూ పాయలు అప్పు చేశారని, ప్రజా జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, ఆర్థీక పరిస్థితుల్లో దేశంలో ఎలాంటి మార్పు లేదని నిత్యావసరాలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని తెలిపారు.

బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ బద్దమైన సీబీఐగాని, ఈడీ డిపార్టెంట్ 24 గంటలు నరేంద్రమోడీ లేదా అమిత్‌షా కనుసైగల్లో పనిచేస్తుందని, అందుకే ఈ రాష్ట్రంలో రాజకీయం బ్రస్టు పట్టిందని తెలిపారు. బీఆర్‌ఎస్ లౌకిక పార్టీ బిజెపి మతపరమైన పార్టీ అని, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కాని కొన్ని దుష్టశక్తులు ప్రచారం చేస్తున్నాయని గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న రైల్ ప్రమాదాలు మోదీ పాలనలు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన వలన రైల్ ప్రమాదాలు జరుగుతున్నాయని, రైల్ ప్రమాద ంలో సుమారు 300 మందిని కేంద్రం పొట్టనపెట్టుకుందని, ఇంతకా లం చర్చకు రాని పౌర స్మృతి ఇప్పుడు ఎందుకు వస్తుంది.

ఎన్నికలు దగ్గర కు వచ్చిన ప్రతి సారి బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొ ందాలని చూస్తుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మనందరెడ్డి, బీఆర్‌యస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News